AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..

రాష్ట్రంలో రెండో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సెకండ్‌ లాంగ్వెజ్‌ పరీక్ష సందర్భంగా కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు కాపీ కొడుతూ దొరికిపోయారు. మరికొన్ని ప్రాంతాల్లో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో విద్యార్థులు ఎగ్జామ్ రాయకుండానే నిరాశతో వెనుతిరిగారు.

Telangana: ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
Inter Exams Telangana
Anand T
|

Updated on: Feb 26, 2026 | 7:20 PM

Share

రాష్ట్రంలో బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.. అయితే గురువారం రాష్ట్రంలో ద్వితియ సంవంత్సరం సెకండ్‌ ల్యాంగ్వేజ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతగా జరిగాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం విద్యార్థులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో ఇద్దరూ, రంగారెడ్డి జిల్లాలో ఒకరు కాపీ కొడుతూ ఇన్విజిలేటర్‌కు చిక్కినట్టు తెలిపారు. మిగతా అన్ని పరీక్షా కేంద్ర ఎగ్జామ్ ప్రశాంతంగా సాగిందన్నారు. ఇక గురువారం జరిగిన ఇంటర్ సెకండ్‌ ల్యాంగ్వేజ్ ఎగ్జామ్‌కు రాష్ట్రవ్యాప్తంగా 4,52,980 మంది విద్యార్థులు హాజరయ్యారని.. మరో 10,374 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు.

ఆలస్యం కావడంతో నో ఎంట్రీ

ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రానికి 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఆమెను ఎగ్జామ్‌ అనుమతించలేదు అధికారులు. విద్యార్థిని తండ్రితో కలిసి ఎంత వేడుకున్నా.. నిబంధనలకు విరుద్దంగా అనుమతించలేమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో కన్నీళ్లు పెడుతూ విద్యార్థిని తండ్రితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అయితే రంజాన్ పండగా సందర్భంగా విద్యార్థిని ఉపవాస దీక్షలో ఉందని.. ఈ క్రమంలోనే రాత్రి 3గంటలకు భోజనం చేసి కాసేపు పడుకుని లేద్దామనుకున్న విద్యార్థిని మార్నింగ్ లేచి సరికి 8.40 అయిందని తండ్రి తెలిపాడు. అప్పటికే హుటాహుటీన రెడీ అయ్యి పరీక్షా కేంద్రానికి చేరుకున్నామని.. కానీ అప్పటికే సమయం 9.15 కావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదన్నారు. దీంతో విద్యార్థిని పరీక్ష రాయకుండానే నిరాశతో ఇంటికి వెళ్లిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us