Watch Video: లార్డ్స్ టెస్టులో జోరూట్ స్పెషల్ మ్యాజిక్ షో.. పరేషాన్ అవుతోన్న నెటిజన్లు.. వీడియో చూస్తే షాకే..

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ లార్డ్స్‌ టెస్టులో అజేయ శతకం సాధించి న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. దీంతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.

Watch Video: లార్డ్స్ టెస్టులో జోరూట్ స్పెషల్ మ్యాజిక్ షో.. పరేషాన్ అవుతోన్న నెటిజన్లు.. వీడియో చూస్తే షాకే..
Joe Root Bat Magic In Lords Test
Follow us

|

Updated on: Jun 06, 2022 | 1:26 PM

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ ప్రస్తుత కాలంలో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ స్పెషల్ రికార్డులో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, విలియమ్సన్ వంటి బ్యాట్స్‌మెన్స్ కంటే జో రూట్ చాలా ముందుకు దూసుకొచ్చాడు. ఆదివారం లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అద్భుత సెంచరీ చేశాడు. అతని సెంచరీ ఆధారంగా, ఇంగ్లాండ్ టీం ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. జో రూట్ సమస్యాత్మకమైన ఇంగ్లీష్ జట్టును నిర్వహించడమే కాకుండా, అజేయంగా 116 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో, జో రూట్ ఓ మ్యాజిక్ (Joe Root Bat Magic) చేశాడు. అది చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. జో రూట్ మ్యాజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్యాట్‌తో మ్యాజిక్ చేసిన జో రూట్..

ఇవి కూడా చదవండి

జో రూట్ 87 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పుడు తన బ్యాట్‌తో ఓ మ్యాజిక్ చేశాడు. జో రూట్ నాన్ స్ట్రైక్‌లో నిలబడి ఉన్నాడు. కైల్ జేమ్సన్ బంతిని విసిరేందుకు పరిగెత్తుతాన్నాడు. అక్కడ జరిగిన చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జో రూట్ నాన్-స్ట్రైక్‌లో నిలబడి ఉన్నప్పుడు, అతని బ్యాట్ ఎటువంటి మద్దతు లేకుండా నిలబడింది. అదేంటని ఆలోచిస్తున్నారా.. అవును, ఎలాంటి సపోర్ట్ లేకుండా బ్యాట్ అలాగే నిలబడి ఉంది. రూట్ చేసిన ఈ మ్యాజిక్‌ వీడియోను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది.

జో రూట్ దీన్ని ఎలా చేశాడు?

ప్రస్తుతం ప్రశ్న ఏమిటంటే, జో రూట్ దీన్ని ఎలా చేశాడు? అసలు ఎలాంటి సపోర్టు లేకుండా బ్యాట్‌ను ఎలా నిల్చోబెట్టాడు? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. దీని రహస్యం రూట్ బ్యాట్‌లో దాగి ఉంది. జో రూట్ బ్యాట్ చిరల్లో చదునుగా ఉంటుంది. అది రౌండ్‌గా లేదు. దీంతో జో రూట్ బ్యాట్ సపోర్టు లేకుండా నేలపై నిల్చుంది. జో రూట్ ఈ మ్యాజిక్ తో పాటు మరో చరిష్మా కూడా చూపించాడు. జో రూట్ తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లతో 10,000 టెస్ట్ పరుగులను కూడా పూర్తి చేశాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..