Harmanpreet Kaur: మిథాలీ రాజ్ రిటైర్మెంట్.. శ్రీలంకతో సిరీస్‌కు కొత్త కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్..
Mithali Raj Retirement: టీమిండియా సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ( Mithali Raj ) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నూతన సారథి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది.
Mithali Raj Retirement: టీమిండియా సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ( Mithali Raj ) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నూతన సారథి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తోన్న హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)తో పాటు స్మృతి మంధాన (Smriti Mandhana) పేర్లు బాగా వినిపించాయి. తాజాగా బీసీసీఐ ఈ చర్చకు తెరదించింది. మిథాలి స్థానంలో కెప్టెన్‌గా అనుభవమున్న హర్మన్ ప్రీత్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమించింది. దీంతో పాటు త్వరలో శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది. ఇక రెండు ఫార్మాట్లలోనూ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.
జెమీమా రోడ్రిగ్స్ రీ ఎంట్రీ..
కాగా టీ20 ప్రపంచకప్ సందర్భంగా జట్టు నుంచి ఉద్వాసనకు గురైన జెమీమా రోడ్రిగ్స్ కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. ఇటీవల ముగిసిన T20 ఉమెన్స్ ఛాలెంజ్‌లోని రెండు మ్యాచ్‌లలో జెమీమా 45.00 సగటుతో 90 పరుగులు చేసింది. అయితే ఆమెకు కేవలం టీ 20 జట్టులో మాత్రమే చోటు దక్కింది. వన్డే జట్టులో మరోసారి చుక్కెదురైంది. ఆమెతో పాటు స్టార్ ఆల్‌రౌండర్ ఝులన్ గోస్వామికి కూడా వన్డే జట్టులో అవకాశం లభించలేదు.
జూన్ 23 నుంచి..
భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటన జూన్ 23న ప్రారంభమై జూలై 7 వరకు కొనసాగనుంది. మొదట టీ20 సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ జూన్ 23న దంబుల్లాలో, రెండో మ్యాచ్ జూన్ 25న, మూడో మ్యాచ్ జూన్ 27న అదే మైదానంలో జరగనుంది. దీని తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు క్యాండీలో జరుగుతాయి. మొదటి మ్యాచ్ జూలై 1న, రెండో మ్యాచ్ జూలై 4న, మూడో మ్యాచ్ జూలై 7న జరగనుంది.
టీ 20 జట్టు :
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, ఎస్ మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, రోద్రీ సింగ్, జెమీమా
వన్డే జట్టు :
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, ఎస్ మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా
Here are #TeamIndia‘s ODI and T20I squads for the Sri Lanka series ? pic.twitter.com/e7yWckJtvG
— BCCI Women (@BCCIWomen) June 8, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: