AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks: హోం లోన్‌ గ్రహీతలకు షాక్‌ ఇచ్చిన ఆ బ్యాంక్‌లు.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!

ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు ఆర్పీఐ రేపో రేటును 50 బేస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు జరిగిన మరుసటి రోజే పలు బ్యాంక్‌లు రుణ వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టాయి...

Banks: హోం లోన్‌ గ్రహీతలకు షాక్‌ ఇచ్చిన ఆ బ్యాంక్‌లు.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!
Home Loan
Srinivas Chekkilla
|

Updated on: Jun 09, 2022 | 4:18 PM

Share

ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు ఆర్పీఐ రేపో రేటును 50 బేస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు జరిగిన మరుసటి రోజే పలు బ్యాంక్‌లు రుణ వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టాయి. ఐసీఐసీఐ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేట్‌ (EBLR)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన రేటు బుధవారం (జూన్‌ 8) నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. దీంతో ఈ బ్యాంకు ఈబీఎల్‌ఆర్‌ (EBLR) రేటు 8.10 శాతం నుంచి 8.60శాతానికి పెరిగినట్లు అయింది. రేపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (BRLLR)ను 7.40శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రకటించింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటుకు అనుసంధానమై ఉండే రుణ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 7.75 శాతం చేసినట్లు ప్రకటించింది. రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (RLLR)ను 6.90శాతం నుంచి 7.40శాతానికి పెంచిన్టలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. పేర్కొంది. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రుణ రేట్లను పెంచేసింది. ప్రస్తుతం 7.25శాతంగా ఉన్న ఆర్‌బీఎల్‌ఆర్‌ (RBLR)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి
Follow Us
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి గుడ్ న్యూస్..
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి గుడ్ న్యూస్..
రఘువరన్ చనిపోయాక సాయం అడిగింది ఆ ఒక్క హీరోనే..
రఘువరన్ చనిపోయాక సాయం అడిగింది ఆ ఒక్క హీరోనే..
కార్మికుల పేర్లతో రూ.8.55 కోట్ల లావాదేవీలు.. ఐటీ నోటీసులతో ..
కార్మికుల పేర్లతో రూ.8.55 కోట్ల లావాదేవీలు.. ఐటీ నోటీసులతో ..
చిన్న కప్పు కుంకుమపువ్వు టీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? తెలిస్తే..
చిన్న కప్పు కుంకుమపువ్వు టీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? తెలిస్తే..
నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన ప్రభుత్వ బడి పిల్లలు
నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన ప్రభుత్వ బడి పిల్లలు
రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
ఘోరం.. తెల్లవారుజామున స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి!
ఘోరం.. తెల్లవారుజామున స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి!
చిరంజీవిని మెగాస్టార్ చేసిన మూవీ.. 43 ఏళ్లుగా బాక్సాఫీస్ కింగ్..
చిరంజీవిని మెగాస్టార్ చేసిన మూవీ.. 43 ఏళ్లుగా బాక్సాఫీస్ కింగ్..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?