Real Estate: రియల్టీపై వడ్డీ పిడుగు.. రేట్ల పెంపు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఎంతంటే..

Real Estate: కేవలం 40 రోజుల్లోపు భారతీయ రిజర్వు బ్యాంక్ రెండు సార్లు రెపో రేటును పెంచింది. ఈ కాలంలో ఏకంగా 90 బేసిస్ పాయింట్ల మేర పెరగటం వల్ల రుణ భారం పెరుగుతోంది.

Real Estate: రియల్టీపై వడ్డీ పిడుగు.. రేట్ల పెంపు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఎంతంటే..
Real Estate
Follow us

|

Updated on: Jun 09, 2022 | 1:00 PM

Real Estate: కేవలం 40 రోజుల్లోపు భారతీయ రిజర్వు బ్యాంక్ రెండు సార్లు రెపో రేటును పెంచింది. ఈ కాలంలో ఏకంగా 90 బేసిస్ పాయింట్ల మేర పెరగటం వల్ల రుణ భారం పెరుగుతోంది. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ నిన్న పెరిగిన వడ్డీ రేట్లకు అనుగుణంగా తమ రేట్లను సవరించాయి. ఈ తరుణంలో హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ మరింత ఖరీదుగా మారనున్నాయి. ఈ ప్రభావం రియల్టీ రంగాన్ని తీవ్రంగా నష్టాల్లోకి నెట్టనుందని తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తురువాత క్రమంగా దేశంలో రియల్టీ రంగం డిమాండ్ పెరుగుతున్న తరుణంలో పెరిగిన ఉక్కు, సిమెంట్, ఇతర మెటీరియల్స్ ధరలు ఇప్పటికే ఆ రంగాన్ని కుదేలు చేస్తోంది. ఈ క్రమంలో పెరిగిన వడ్డీ రేట్లు కారణంగా డిమాండ్ భారీగా పడిపోతుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హఠాత్తుగా ఎదురైన పరిణామాల కారణంగా.. వినియోగదారులు సైతం తమ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నట్లు స్థిరాస్తి కన్సల్టెన్సీలు అంటున్నాయి. ఈఎంఐల భారాన్ని ప్రస్తుతం ఉన్న తరుణంలో మోయలేమనుకునే కస్టమర్లు తాత్కాలికంగా తమ నిర్ణయాలను మార్చుకుంటున్నారని తెలుస్తోంది. స్వల్ప కాలంలో దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయని బ్యాంకింగ్ నిపుణులు అంచనాల ప్రకారం తెలుస్తోంది. దీని వల్ల రియల్టీ రంగం మందగమనంలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో అనేక ప్రాపర్టీల్లో అమ్మకం కాని ప్రాపర్టీల సంఖ్య భారీగానే కొన్ని నివేధికలు చెబుతున్నాయి. పరిస్థితులు పూర్తిగా చక్కపడేందుకు దాదాపు ఏడాది కాలం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రియల్టీ పరిశ్రమ గడ్డు కాలం చూడక తప్పదని చెప్పుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.