Bank Employees Strike: ఈ నెల 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. 3 రోజులు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు..

Bank Employees Strike: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 27న సమ్మెకు దిగే అవకాశం ఉంది. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు పని నిలిపివేయనున్నారు.

Bank Employees Strike: ఈ నెల 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. 3 రోజులు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు..
Banks
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 09, 2022 | 12:41 PM

Bank Employees Strike: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 27న సమ్మెకు దిగే అవకాశం ఉంది. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు పని నిలిపివేయనున్నారు. 9 బ్యాంకు యూనియన్ల సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ మేరకు వెల్లడించింది. ఉద్యోగులు సమ్మె చేస్తే వరుసగా 3 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎందుకంటే 25వ తేదీ నెలలో నాలుగో శనివారం, 26 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. దీనికి తోడు ఉద్యోగులు 27న సమ్మే నిర్వహిస్తున్నందున వరుసగా మూడు రోజుల పాటు ప్రజలకు బ్యాంకింగ్ సేవలు దూరం కానున్నాయి. ఈ పరిస్థితిలో అనేక మంది సామాన్యులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తోంది.

బ్యాంకుల్లో వారానికి  ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని యూనియన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ప్రైవేట్ రంగంలోని అనేక బ్యాంకులు ఇప్పటికే ఈ పని పద్ధతిని అమలు చేస్తున్నాయి. అయితే.. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులు సైతం ఇలాంటి వెసులు బాటు తమకు కల్పించాలని కోరుతున్నారు. దీనికి తోడు.. ప్రభుత్వం ముందు ఉంచిన పెన్షన్ డిమాండ్ ను సైతం అంగీకరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకుంటే.. దేశ వ్యాప్తంగా 9 బ్యాంకులకు చెందిన 7 లక్షల మంది ఉద్యోగులు సమ్మేలో పాల్గొంటారని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా వెల్లడించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.