AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఎల్‌ఐసీ షేర్లు.. రూ.4,56,569.96 కోట్లకు చేరిన మార్కెట్‌ క్యాప్‌..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లలో క్షీణత కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్‌లో ఎల్‌ఐసీ షేరు సరికొత్త కనిష్ట స్థాయికి చేరింది. బీఎస్ఈలో ఈ షేరు 2.32 శాతం క్షీణించి రూ.720.85కి చేరుకుంది. ఇది 52 వారాల కనిష్టం. స్టాక్ ఇష్యూ ధర రూ.949 నుంచి 25 శాతం పడిపోయింది...

LIC: కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఎల్‌ఐసీ షేర్లు.. రూ.4,56,569.96 కోట్లకు చేరిన మార్కెట్‌ క్యాప్‌..
LIC
Srinivas Chekkilla
|

Updated on: Jun 09, 2022 | 3:49 PM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లలో క్షీణత కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్‌లో ఎల్‌ఐసీ షేరు సరికొత్త కనిష్ట స్థాయికి చేరింది. బీఎస్ఈలో ఈ షేరు 2.32 శాతం క్షీణించి రూ.720.85కి చేరుకుంది. ఇది 52 వారాల కనిష్టం. స్టాక్ ఇష్యూ ధర రూ.949 నుంచి 25 శాతం పడిపోయింది. ఎల్‌ఐసీ సంపద రూ.1.43 లక్షల కోట్లు తగ్గింది. లిస్టింగ్ అయిన ఒక నెలలోనే, LIC మార్కెట్ క్యాప్ క్వార్టర్ క్లియర్ అయింది. ఇష్యూ ధర రూ.949 వద్ద ఎల్‌ఐసీ మార్కెట్ క్యాప్ రూ.6,00,242 కోట్లు కాగా, ఇప్పుడు రూ.1,43,672 కోట్లు తగ్గి రూ.4,56,569.96 కోట్లకు చేరుకుంది. LIC స్టాక్ 17 మే 2022న స్టాక్ మార్కెట్‌లో లిస్టయింది. లిస్టింగ్ రోజు నుంచి తగ్గుతూ వస్తోంది. ఎల్‌ఐసీ షేర్లను ఇన్వెస్టర్లకు రూ.949కి కేటాయించారు. షేర్లు డిస్కౌంట్‌తో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయ్యాయి. దీని మార్కెట్ క్యాప్ ఇప్పటికీ SBI, HDFC, భారతీ ఎయిర్‌టెల్ కంటే ఎక్కువగా ఉంది. గ్లోబల్ ఫైనాన్షియల్ హౌస్ Macquarie ఈ స్టాక్‌కు టార్గెట్ ధరను రూ. 1000గా నిర్ణయించింది. అస్థిరత కారణంగా దాని ఎంబెడెడ్ విలువ ప్రభావితమైందని చెబుతోంది.

ఇదిలావుండగా, ఏడాదిలోగా ఈ స్థాయికి చేరుకుంటుందని అంచనా. వైవిధ్యభరితమైన ఉత్పత్తి లేకపోవడం వల్ల తమ మార్కెట్ వాటా నిరంతరం క్షీణిస్తోందని ఆర్థిక సంస్థ చెబుతోంది. అటువంటి పరిస్థితిలో కంపెనీ తన ఉత్పత్తిలో వైవిధ్యతను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో మార్కెట్లో లిస్ట్ అయిన Paytm, Zomato, Nykaa వంటి కంపెనీల్లో పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయిన పెట్టుబడిదారులకు ఎల్ఐసీ మరింత పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో ఎల్ఐసీ ర్యాంకింగ్ 5వ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయింది. బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ “ది ఎలిఫెంట్ దట్ కాంట్ డ్యాన్స్” అనే నివేదికలో ఎల్‌ఐసీపై హోల్డ్ రేటింగ్ ఇచ్చింది. బ్రోకరేజ్ సంస్థ జూన్ 2023 వరకు టార్గెట్ ధర రూ. 875గా అంచనా వేసింది.

Follow Us
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!