AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతర్జాతీయ వేదికపై మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ సత్తా.. వరుసగా రెండోసారి స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు

MY Home Group: అంతర్జాతీయ వేదికపై మై హోమ్ గ్రూప్ సంస్థ సత్తా చాటింది. అత్యున్నత ఆరోగ్యం, భద్రత, పర్యావరణ ప్రమాణాలకు మారుపేరైన మై హోమ్ కన్‌స్ట్రక్షన్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ అందించే స్వోర్డ్ ఆఫ్ ఆనర్ 2026 పురస్కారాన్ని వరుసగా రెండో ఏడాది కైవసం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అంతర్జాతీయ వేదికపై మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ సత్తా.. వరుసగా రెండోసారి స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు
My Home Construction Wins British Safety Council Sword Of Honour Award
Krishna S
|

Updated on: Nov 28, 2026 | 9:34 PM

Share

నిర్మాణ రంగంలో అత్యున్నత ఆరోగ్యం, భద్రత, పర్యావరణ ప్రమాణాలను పాటిస్తున్న ప్రముఖ సంస్థ మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ మరో అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ అందించే ప్రతిష్ఠాత్మక స్వోర్డ్ ఆఫ్ ఆనర్ 2026 అవార్డును (British Safety Council Sword of Honour Award 2026)  మై హోమ్ గ్రూప్ కైవసం చేసుకుంది. ఈ అవార్డును మై హోమ్ సంస్థ వరుసగా రెండో ఏడాది అందుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, భద్రత, ఉద్యోగుల సంక్షేమం, ప్రక్రియ భద్రత, పర్యావరణ నిర్వహణలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సంస్థలను గుర్తించి బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఈ ఆనర్ అవార్డ్స్‌తో సత్కరిస్తుంది. గతంలో వీటిని స్వోర్డ్, గ్లోబ్, షీల్డ్ ఆఫ్ ఆనర్ అవార్డులుగా పిలిచేవారు. ప్రస్తుతం ఇందులో నాలుగు విభాగాలు ఉన్నాయి..

  • స్వోర్డ్ ఆఫ్ ఆనర్
  • గ్లోబ్ ఆఫ్ ఆనర్
  • షీల్డ్ ఆఫ్ ఆనర్
  • గార్డియన్ ఆఫ్ ఆనర్

ప్రతి ఏటా బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నిర్వహించే ఫైవ్ స్టార్ ఆడిట్ (ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆడిట్, ఎన్విరాన్‌మెంటల్ ఆడిట్, ఇంటిగ్రేటెడ్ ఆడిట్ లేదా కంబైన్డ్ ఆడిట్)లలో అత్యుత్తమ ఫైవ్-స్టార్ రేటింగ్ సాధించిన సంస్థలు మాత్రమే ఈ అవార్డులకు అర్హత సాధిస్తాయి. ఆ కఠినమైన ప్రమాణాలన్నింటినీ అధిగమించి మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ వరుసగా రెండోసారి ఈ గౌరవాన్ని దక్కించుకుంది.

ఏఐ వినియోగం – వినూత్న ఆలోచనలకు పెద్దపీట

ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిన సందర్భంగా మై హోమ్ కన్‌స్ట్రక్షన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ విభాగాధిపతి భాస్కర్ రాజు హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ రంగంలో భద్రతా ప్రమాణాలను భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, రాబోయే ప్రాజెక్టులలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఫైవ్-స్టార్ రేటింగ్‌ను సాధించడంలో భాగంగా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించే ప్రణాళికలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమానికే యాజమాన్యం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Follow Us