Nayanthara Vignesh Wedding: మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమపక్షులు.. వైరలవుతున్న పెళ్లి ఫోటోస్..
యాంటిక్ జువెలరీతో నయన్ లుక్ ఆకట్టుకోగా.. విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ డ్రెస్ లో మెరిసాడు. ఈరోజు ఉదయం మహాబలిపురంలోని హోటల్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది
ఎట్టకేలకు మూడుముళ్ల వేడుకతో ఒక్కటైన నయన్ – విఘ్నేష్ జంట.. తన ఫేవరేట్ ఎరుపు రంగు కాస్ట్యూమ్స్ లో పెళ్లి కూతురుగా మెరిసింది నయన్.. యాంటిక్ జువెలరీతో నయన్ లుక్ ఆకట్టుకోగా.. విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ డ్రెస్ లో మెరిసాడు. ఈరోజు ఉదయం మహాబలిపురంలోని హోటల్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, కార్తి, విజయ్ దళపతి, డైరెక్టర్ అట్లీ, నిర్మాత బోనీ కపూర్ ఇలా పలువురు సినీ ప్రముఖులు హజరయ్యి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తాజాగా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రాగా.. నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిజానికి నయన్, విఘ్నేశ్‌లు తమ వివాహ వేడుకను తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వేదికను మహాబలిపురానికి మార్చుకున్నాం అంటూ ఇటీవలే ప్రకటించారు నయనతార. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులను ఇన్‌వైట్ చేస్తూ పోస్టులు పెట్టారు నయనతార. రీసెంట్ డేస్‌లో సౌతిండియాలో జరిగిన అతి పెద్ద స్టార్ కపుల్ పెళ్లి ఇదే.
ఇక పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమైన నయన్ కెరీర్ పరంగా కూడా ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఏకంగా లేడీ సూపర్‌స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నారు నయనతార. తెలుగు ఆడియన్స్‌కి సైతం దగ్గరయ్యారు. రీసెంట్‌గా ఫియాన్సీ విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో కేఆర్‌కే అనే మూవీలో నటించారు నయన్.
On a scale of 10…
She’s Nayan & am the One ☝️☺️??
With God’s grace , the universe , all the blessings of our parents & best of friends
Jus married #Nayanthara ☺️?? #WikkiNayan #wikkinayanwedding pic.twitter.com/C7ySe17i8F
— Vignesh Shivan (@VigneshShivN) June 9, 2022