NBK 107: బాలయ్య సినిమా టీజర్ రిలీజ్‏కు టైమ్ ఫిక్స్.. ఆయుధంతో బరిలోకి దిగనున్న నటసింహం..

ఇందులో బాలయ్య సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ,...

NBK 107: బాలయ్య సినిమా టీజర్ రిలీజ్‏కు టైమ్ ఫిక్స్.. ఆయుధంతో బరిలోకి దిగనున్న నటసింహం..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2022 | 3:15 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమాతో సంచలనం సృష్టించిన తర్వాత బాలయ్య చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇందులో బాలయ్య సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ,… ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా వెయిట్ చేస్తున్న సమయంలో.. స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 9న అంటే గురువారం సాయంత్రం 6 గంటలకు 11 నిమిషాలకు మెయిన్ అప్డేట్ గా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఇందుకు సంబంధించి NBK 107 ఫస్ట్ హంట్ పేరుతో సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో పులిచర్ల పేరుతో మైలు రాయి కనపడుతుంది. దానిపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఆ రాయిని అనుకుని సింహపు ఆకారపు నగిషీగా చెక్కిన గొడ్డలి కూడా కనిపిస్తుతంది. దానిపై కూడా రక్తపు మరక ఉంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కోసం బాలకృష్ణ విలన్స్ తో సరిచేసేందుకు సరికొత్త ఆయుధంలో బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. ఇక ఫస్ట్ హంట్ పేరుతో విడుదలైన ఈ పోస్టర్ తో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ సినిమానే కాకుండా బాలయ్య.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నారు. ఈ సినిమా కూడా పక్కా మాస్ యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తోంది.

ట్వీట్..