Ante Sundaraniki: నాని సతీమణి స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు.. ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌గా..

Ante Sundaraniki: నాని హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'అంటే సుందరానికి'పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో కూడా విడుదలవుతోన్న ఈ సినిమాపై...

Ante Sundaraniki: నాని సతీమణి స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు.. ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌గా..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 09, 2022 | 1:46 PM

Ante Sundaraniki: నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి’పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో కూడా విడుదలవుతోన్న ఈ సినిమాపై మంచి బజ్‌ ఉంది. సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే గురువారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్‌ కళ్యాణ్‌ హాజరవుతుండడంతో అందరి దృష్టిపడింది.

ఈ క్రమంలోనే తాజాగా నటి నజ్రియా ఇనస్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘అంటే సుందరానికీ సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌కి నాని సతీమణి అంజనతో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అంజనకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆమె ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌గా వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక వీడియో చివరల్లో నాని కూడా వారిద్దరితో కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన నజ్రియా ‘నాని, అంజనతో కలిసి డ్యాన్స్‌ చేయడం ఆనందంగా ఉంది’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు ప్రేమలో పడితే.. పెద్దలను ఒప్పించి వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి ఎన్ని కష్టాలు పడ్డారన్నదే సినిమా సినిమా కథాంశం. మరి ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..