Nayanthara Vignesh Wedding: అవును.. వారిద్దరు ఒక్కటయ్యారు. ప్రియుడితో ఏడడుగులు వేసిన నయనతార..
Nayanthara Vignesh Wedding: సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్లుగా సాగిన వీరి ప్రేమ ప్రయాణం...
Nayanthara Vignesh Wedding: సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్లుగా సాగిన వీరి ప్రేమ ప్రయాణం… పెళ్లి బంధంతో కొత్త మలుపు తీసుకుంది. దీంతో… ఇండియన్ స్టార్ కపుల్స్ జాబితాలో చేరిపోయింది నయన్ అండ్ విక్కీ జంట. మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో నయన్ పెళ్లి ఘనంగా జరిగింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూఖ్‌ఖాన్ లాంటి టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అతిథులుగా హాజరై.. కొత్త జంటకు ఆశీర్వచనాలు అందజేశారు. శింబు, ప్రభుదేవా, కార్తీ, బోనీకపూర్… ఇలా తారలంతా దిగివచ్చిన వేళ.. నయన పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. మీడియాను లోపలికి అనుమతించకుండా.. పర్‌ఫెక్ట్ ప్రైవేట్ ఫంక్షన్‌లా నిర్వహించారు.
నిజానికి నయన్, విఘ్నేశ్‌లు తమ వివాహ వేడుకను తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వేదికను మహాబలిపురానికి మార్చుకున్నాం అంటూ ఇటీవలే ప్రకటించారు నయనతార. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులను ఇన్‌వైట్ చేస్తూ పోస్టులు పెట్టారు నయనతార. రీసెంట్ డేస్‌లో సౌతిండియాలో జరిగిన అతి పెద్ద స్టార్ కపుల్ పెళ్లి ఇదే.
ఇక పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమైన నయన్ కెరీర్ పరంగా కూడా ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఏకంగా లేడీ సూపర్‌స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నారు నయనతార. తెలుగు ఆడియన్స్‌కి సైతం దగ్గరయ్యారు. రీసెంట్‌గా ఫియాన్సీ విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో కేఆర్‌కే అనే మూవీలో నటించారు నయన్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..