Godse Trailer : ‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్‌లో ఉండాలి’.. ఆకట్టుకుంటోన్న ‘గాడ్సే’ ట్రైలర్

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నటున్నాడు. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు స‌త్య‌దేవ్.

Godse Trailer : ‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్‌లో ఉండాలి'.. ఆకట్టుకుంటోన్న 'గాడ్సే' ట్రైలర్
Satyadev Godse
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2022 | 1:09 PM

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్( Satya dev) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నటున్నాడు. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు స‌త్య‌దేవ్. తాజాగా ఈ టాలెంట్ హీరో  టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’(Godse). గోపి గణేష్ పట్టాభి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 17న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలో గాడ్సే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘సత్యమేవ జయతే అంటారు.. ‘ధర్మో రక్షితి రక్షత: అంటారు.. కానీ సమాజంలో సత్యం,ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు’..అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ‘పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత? అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత? గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత? సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?’  ‘ప్రశ్నిస్తే… మారణకాండ చేసేస్తారా? అనే డైలాగ్ అలాగే ‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్‌లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్‌ కావాలి.. సబ్జెక్ట్‌ ఉన్నో సర్పంచ్‌ కావాలి’, ‘సుజలాం సుఫలం మలయజ శీతలం’ అంటూ చివరలో సత్య దేవ్ చెప్పేడైలాగ్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమాతో సత్య దేవ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సి.కె.స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు.  ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా గోపి గ‌ణేష్ అందిస్తున్నారు. అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్య‌వ‌స్థ‌ను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్య‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. బ్ర‌హ్మాజీ ,సిజ్జూ మీన‌న్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు