Sk 20: డైరెక్టర్ అనుదీప్, శివకార్తికేయన్ సినిమా నుంచి మరో అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేది అప్పుడే..

#SK20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

Sk 20: డైరెక్టర్ అనుదీప్, శివకార్తికేయన్ సినిమా నుంచి మరో అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేది అప్పుడే..
Sivakarthikeyan
Follow us

|

Updated on: Jun 08, 2022 | 8:22 PM

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కు (Sivakarthikeyan) తెలుగులో ఉన్న పాలోయింగ్ గురించి తెలిసిందే. రెమో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శివకార్తికేయన్.. ఆ తర్వాత సీమరాజా, కౌసల్య కృష్ణమూర్తి, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నాడు.. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో శివకార్తికేయన్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. #SK20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వీరిద్దరి కాంబో నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

డైరెక్టర్ అనుదీప్ కెవి, శివకార్తికేయన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ జూన్ 9న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇందులో ఉక్రెయిన్ బ్యూటీ మరినా ర్యాబోశప్క కథానాయికగా నటించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లుగా గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో సాగుతుంది.

ఇవి కూడా చదవండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ