Ram Charan: మరో సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏కు చరణ్ గ్రీన్ సిగ్నల్ ?.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..

ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

Ram Charan: మరో సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏కు చరణ్ గ్రీన్ సిగ్నల్ ?.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 08, 2022 | 2:48 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో అల్లురి సీతారామరాజు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు చరణ్. ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. అంతేకాకుండా పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతోపాటు… చరణ్ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఇప్పటికే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ చరణ్ ఓ మూవీ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం… చరణ్ మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవల విడుదలైన విశ్వనటుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కలిసి నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ లోకేష్.. తన తదుపరి ప్రాజెక్ట్ విజయ్ తలపతితో చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న లోకేష్.. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడట. ఆర్సీ 15 పూర్తయ్యేలోపు చరణ్ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తిచేయాలని భావిస్తున్నాడట. అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మూవీ చేసేందుకు చరణ్ సైతం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబోకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లుగా టాక్.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?