HANU-MAN Movie: హనుమాన్ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదల.. సైన్యంతో దూసుకువస్తోన్న మ్యాన్ ఆఫ్ డూమ్…

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో హనుమాన్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి..

HANU-MAN Movie: హనుమాన్ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదల.. సైన్యంతో దూసుకువస్తోన్న మ్యాన్ ఆఫ్ డూమ్...
Hanuman
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 08, 2022 | 2:34 PM

యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం హనుమాన్ (Hanuman). కల్కి, జాంబిరెడ్డి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో హనుమాన్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి బ్యాడాస్ ఈవిల్ మ్యాన్ మైఖేల్ పోస్టర్ విడుదల చేశారు హీరో రానా దగ్గుబాటి.

ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ మైఖేల్ పాత్రలో ప్రముఖ హీరో వినయ్ రాయ్ నటిస్తున్నాడు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ ధరించిన ‘బ్యాడాస్ ఈవిల్ మ్యాన్’ మైఖేల్.. భారీ మెషిన్ గన్‌లను మోస్తున్న తన సైన్యంతో ఫ్లైయింగ్ సాసర్స్‏ని తలపించే రోబోటిక్ బ్యాట్స్ నిఘాలో ఒక గుడి ముందు నడుస్తూ రావడం టెర్రిఫిక్‏గా వుంది. ప్రత్యేకంగా రూపొందించిన గ్యాస్ మాస్క్, పైరేట్ ఐ ప్యాచ్‏తో ఈవిల్ మ్యాన్‏లా కనిపిస్తోన్న వినయ్ రాయ్.. తన ఫస్ట్ లుక్ లోనే భయపెట్టారు. బాట్‌మ్యాన్‌కు జోకర్, సూపర్‌మ్యాన్ కు లెక్స్ లూథర్ లాగా హను-మాన్ కు మైఖేల్ సూపర్‌విలన్. ఐతే మైఖేల్ అందరిలాంటి సూపర్ విలన్ కాదు. మైఖేల్ పాత్రకు గొప్ప క్యారెక్టర్ ఆర్క్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించినట్లు ఉన్నతమైన టెక్నాలజీ అతని సొంతం. అతను ఎక్కడ నుండి వచ్చాడు? అంజనాద్రి లోకానికి ఎందుకు వస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. బిగ్ స్టార్స్, టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది. కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. నలుగురు ట్యాలెంటెడ్ సంగీత దర్శకులు – అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూస్తున్నారు.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?