Nayanthara and Vignesh Shivan : నయన్, విఘ్నేష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదేనా.. నెట్టింట ట్రెండింగ్
Nayanthara Vignesh Wedding: లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు నడవనున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు నడవనున్నారు. రేపు (జూన్ 9)న మహాబలిపురంలో నయన్ , విఘ్నేష్ వివాహం జరగనుంది. రీసెంట్ గా తమ పెళ్లి విషయాలను మీడియాతో పంచుకున్నారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. తమ పెళ్లి జూన్ 9 మహాబలిపురంలో జరగనుందని క్లారిటీగా చెప్పారు. అంతేకాదు పెళ్లికి సంబంధించిన మరిన్ని విషయాలను కూడా చెప్పేశారు. మై లవ్ నయన్‌ను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్ 9 న నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు అని విఘ్నేష్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం హిందూ సంప్రదాయంలో మహాబలిపురంలో జూన్ 9 ఉదయం 8.30 గంటలకు జరగనుంది. వీరి వివాహానికి డ్రస్ కోడ్ కూడా ఉంది. సాంప్రదాయ దుస్తుల్లో వివాహానికి హాజరుకావాలని ఆ వివాహ పత్రికలో రాసిఉంది.