Ante Sundaraniki: నాని అంటే సుందరానికి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఖరారు.. గెస్ట్‌గా ఆ స్టార్ హీరో

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ante Sundaraniki: నాని అంటే సుందరానికి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఖరారు.. గెస్ట్‌గా ఆ స్టార్ హీరో
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2022 | 8:07 PM

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి(Ante Sundaraniki), వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తొలిసారి తెలుగులోకి అడుగుపెడుతుంది మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ  రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. రీసెంట్ గా ప్రమోషన్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. జూన్ 10న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలో అంటే సుందరని మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గా  గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

అంటే సుందరానికి ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ ఈవెంట్ ను హైదరాబాద్  లో జూన్ 9న నిర్వహించనున్నారని హీరో నాని ట్వీట్ చేశారు. నాని ఈవెంట్ కు పవర్ స్టార్ గెస్ట్ గా వస్తుండటం తో నాని అభిమానులు, పవన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన అంటే సుందరానికి మూవీ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే..

ఇవి కూడా చదవండి

Nani , Pawan Kalyan

Nani , Pawan Kalyan

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు