Mahesh Babu: ఆ మాస్ దర్శకుడికి మహేష్ బాబు ఛాన్స్ ఇవ్వనున్నాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది.

Mahesh Babu: ఆ మాస్ దర్శకుడికి మహేష్ బాబు ఛాన్స్ ఇవ్వనున్నాడా..?
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2022 | 7:36 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే భారీ వసూళ్లను కూడా రాబట్టింది సర్కారు వారి పాట. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా జరిగాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి రోజూ ఏదోఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ సినిమాలతో పాటు మహేష్ మరో మాస్ దర్శకుడితో సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట మైత్రివారు. ఇదిలా ఉంటే ఇటీవల గోపీచంద్ మలినేని మహేష్ బాబు తో సినిమా చేయడం తన డ్రీమ్ అని కూడా తెలియజేశాడు. దాంతో బాలయ్య సినిమా తర్వాత గోపీచంద్ మహేష్ తో సినిమా చేసే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే