Kajal Aggarwal: చందమామ మళ్ళీ ఫామ్‌లోకి రానుందా..? రీ ఎంట్రీకి రెడీ అవుతున్న కాజల్

లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. ఆతర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది.

Kajal Aggarwal: చందమామ మళ్ళీ ఫామ్‌లోకి రానుందా..? రీ ఎంట్రీకి రెడీ అవుతున్న కాజల్
Kajal
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 08, 2022 | 12:47 PM

లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). ఆ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. ఆ వెంటనే రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది. తక్కువ సమయంలోనే కాజల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ వయ్యారి. ఇక తమిళ్ లోనూ సత్తా చాటింది కాజల్ అగర్వాల్. అటు బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ అమ్మడు.

ఇక కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లును పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది కాజల్. అయితే కాజల్ చివరిగా నటించిన తెలుగు సినిమా ఆచార్య. కానీ ఏమైందో ఏమో కానీ కాజల్ నటించిన సన్నివేశాలను సినిమానుంచి తొలగించారు. ఇక ఇంతకాలం గ్యాప్ తీసుకున్న కాజల్. ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది.  ప్రగ్నెన్సీ సమయంలో కాస్త బొద్దుగా మారిన కాజల్. ఇప్పుడు తిరిగి సన్నగా, గ్లామరస్ గా మారుతుంది. గతంలో కాజల్ సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంటుందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తల పై కాజల్ స్పందించలేదు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు రీఎంట్రీ కి రెడీ అవుతుందని.. అందుకు తగ్గట్టుగా ఫిట్ నెస్ పై దృష్టి పెడుతోందని టాక్ వినిపిస్తుంది. వీలైనంత త్వరగా కాజల్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తుందని వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్