AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay-Rashmika: ఒక్కటైన విజయ్, రష్మిక.. ఉదయ్ పూర్‌లో మోగిన విరోష్ పెళ్లి బాజాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో కొత్త జీవితం ప్రారంభించారు. ఇప్పటివరకు రీల్ లైఫ్ లో జంటగా కనిపించిన వీరు ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ భార్యభర్తలు అయ్యారు. ఉదయ్ పూర్ లో వీరి వివాహం కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య జరిగింది.

Vijay-Rashmika: ఒక్కటైన విజయ్, రష్మిక.. ఉదయ్ పూర్‌లో మోగిన విరోష్ పెళ్లి బాజాలు
Vijay, Rashmika
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2026 | 11:31 AM

Share

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఒక్కటయ్యారు. సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు ఉదయ్‌పూర్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. కొద్దిమంది బంధువులు సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లిలో విజయ్, రష్మిక చూడముచ్చటగా ఉన్నారు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ విజయ్, రష్మిక మెడలో మాంగల్యధారణ చేశాడు. వదువుగా రష్మిక ఎంతో ఆనందంతో కనిపించింది. కాగా సాయంత్రం 4.30 గంటలకు కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ వేడుక జరగనుంది.

గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇప్పుడు భార్యాభర్తలుగా మారారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రెటీలు విజయ్, రష్మికాకు విషెస్ తెలుపుతున్నారు. వివాహబంధంతో ఒక్కటైనా ఈ జంటకు పలువురు సెలబ్రెటీలు, అభిమానులు విషెస్ తెలుపుతూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ రష్మిక కలిసి రెండు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తొలి సారి గీతగోవిందం సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది. ఆతర్వాత మరోసారి ఈ ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్  అనే సినిమా చేశారు. ఇక ఈ ఇద్దరూ తమ రిలేషన్ ను చాలా సీక్రెట్ గా ఉంచారు. కానీ అభిమానులు ఎప్పుడూ వీరి పై ఓ కన్నేసే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ జంట ఒక్కటవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులులేకుండా పోయాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర