AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay-Rashmika: విజయ్ మాట వినగానే రష్మికలో సిగ్గు మొగ్గలేసిందిగా..!! వైరల్ అవుతున్న వీడియో

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఒక్కటయ్యారు. సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు ఉదయ్‌పూర్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. కొద్దిమంది బంధువులు సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లిలో విజయ్, రష్మిక చూడముచ్చటగా ఉన్నారు.

Vijay-Rashmika: విజయ్ మాట వినగానే రష్మికలో సిగ్గు మొగ్గలేసిందిగా..!! వైరల్ అవుతున్న వీడియో
Rashmika Vijay
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2026 | 12:35 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది. నేడు ఉదయ్ పూర్ లో వీరి వివాహ వేడుక జరుగుతుంది. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తెలుస్తున్న ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. విజయ్, రష్మిక కలిసి రెండు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఈ ఇద్దరూ కలిసి గీతగోవిందం సినిమాలో హీరో, హీరోయిన్ గా కనిపించారు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం..  రెండో సినిమా సమయానికి ప్రేమగా మారింది. డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ రష్మిక కలిసి నటించారు. ఇక చాలా కాలం ప్రేమలో ఉన్న ఈ ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నేడు ( ఫిబ్రవరి 26న ) విజయ్ రష్మిక వివాహం జరిగింది.

రాజస్థాన్ ఉదయ్‌పూర్ వేదికగా వేడుకగా జరిగిన మూడు ముళ్ల పండక్కి అత్యంత ఆత్మీయులు హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం నిర్వహించిన పెళ్లి కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు  వీరి వివాహం జరిగింది. అలాగే సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ వేడుక జరగనుంది. సోషల్ మీడియా వేదికగా విజయ్, రష్మికాకు అభిమానులు, పలువురు సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా గతంలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోలో పాల్గొంది రష్మిక. యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ, రష్మిక హాజరయ్యారు. ఆ సమయంలో విజయ్‌కు లైవ్ లో కాల్ చేసింది రష్మిక. ఫోన్ లిఫ్ట్ చేసి వాట్సాప్ రే అని విజయ్ అనగానే  రష్మిక తెగ సిగ్గు పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..