AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godse Movie: గాడ్సే మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆకట్టుకుంటున్న రా రమ్మంది వీడియో సాంగ్..

రా రమ్మంది ఊరు.. ర‌య్యిందీ హుషారు.. రాగ‌మందుకుంది జ్ఞాప‌కాల జోరు.. ప‌చ్చ‌నైన చేలు ప‌ల్లె ప‌రిస‌రాలు.. ఎంత కాల‌మైనా మ‌రువ లేరు నా పేరు.

Godse Movie: గాడ్సే మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆకట్టుకుంటున్న రా రమ్మంది వీడియో సాంగ్..
Sathyadev
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2022 | 2:16 PM

Share

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సత్యదేవ్ (Sathyadev). ప్రస్తుతం ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గాడ్సే. ఈ చిత్రానికి గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇటీవల గాడ్సే సినిమా నుంచి వరుస అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి రా రమ్మంది ఊరు వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

‘‘రా రమ్మంది ఊరు.. ర‌య్యిందీ హుషారు.. రాగ‌మందుకుంది జ్ఞాప‌కాల జోరు.. ప‌చ్చ‌నైన చేలు ప‌ల్లె ప‌రిస‌రాలు.. ఎంత కాల‌మైనా మ‌రువ లేరు నా పేరు… ’’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. . స‌త్య‌దేవ్ లుక్‌, శాండీ అద్దం, సునీల్ క‌శ్య‌ప్ సంగీతం, సురేష్‌.ఎస్ సినిమాటోగ్ర‌ఫీ స‌న్నివేశాల‌ను ఎన్‌హెన్స్ చేస్తున్నాయి. రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన రా ర‌మ్మంది ఊరు .. అనే పాట‌ను రామ్ మిర్యాల పాడారు. సి.కె.స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సి.క‌ళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా గోపి గ‌ణేష్ అందిస్తున్నారు. అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్య‌వ‌స్థ‌ను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్య‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. బ్ర‌హ్మాజీ ,సిజ్జూ మీన‌న్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!