జనగామ జిల్లా పాలకూర్తి పోలీసులు ఇంటర్ పరీక్షల సమయంలో డీజే సౌండ్స్‌పై నిషేధం విధించారు. శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా సీఐ జానకిరాం రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.