AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో సత్కారం.. ప్రపంచంలోనే తొలి నేతగా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్‌ పార్లమెంట్.. ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో ఘనంగా సత్కరించింది. ఇజ్రాయెల్ కనెసెట్‌ అందించే అత్యున్నత పురస్కారం ఇదే.. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లు పార్లమెంట్ కనెసెట్‌ తెలిపింది.

PM Modi: ప్రధాని మోదీకి ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో సత్కారం.. ప్రపంచంలోనే తొలి నేతగా..
PM Modi conferred with Israel's highest parliamentary honour
Shaik Madar Saheb
|

Updated on: Feb 26, 2026 | 9:13 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్‌ పార్లమెంట్.. ‘స్పీకర్‌ ఆఫ్‌ ది కనెసెట్‌ మెడల్‌’తో ఘనంగా సత్కరించింది. ఇజ్రాయెల్ కనెసెట్‌ అందించే అత్యున్నత పురస్కారం ఇదే.. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లు పార్లమెంట్ కనెసెట్‌ తెలిపింది. ఈ మెడల్‌ను అందుకున్న తొలి నేత కూడా ప్రధాని మోదీయే. కనెసెట్‌ స్పీకర్‌ అమిర్‌ ఒహానా దీన్ని ప్రదానం చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా.. రెండు దేశాల నుంచీ అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన నేతగా మోదీ నిలిచారు. విదేశీ నేతలకు పాలస్తీనా ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా’ను 2018లో ఆయన స్వీకరించిన విషయం తెలిసిందే.

కాగా.. రెండురోజుల పర్యటనలో భాగంగా.. ఇజ్రాయెల్‌ నిన్న చేరుకున్న మోదీ.. తొలుత ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహుతో భేటీ అయ్యారు. అనంతరం కనెసెట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ప్రసంగించే గౌరవం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగాన్ని ఆరంభించిన ఆయన.. ‘స్నేహం, గౌరవం, భాగస్వామ్యం’ అనే సందేశాన్ని తాను మోసుకొచ్చానన్నారు.

భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య చిరకాల స్నేహం ఉందని.. ఇజ్రాయెల్‌కు భారత్‌ ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అంతేకాకుండా.. గాజా శాంతి ప్రణాళికను కూడా స్వాగతిస్తోందని.. ఇజ్రాయెల్‌ పాలస్తీనా ప్రాంతంలో శాంతి నెలకొనాలని బలంగా కోరుకుంటున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ పార్లమెంటు కనెసెట్‌లో మోదీ ప్రసంగించారు. 2023 అక్టోబర్‌ 7న ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం ఉన్న ప్రతిచోటా శాంతికి ముప్పుగా పరిణమిస్తుందన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు