తెలుగు యూట్యూబర్ కోమలి హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో ఆత్మహత్య చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అఖిల్ రెడ్డితో ఆమెకు మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. విభేదాలు రావడంతో గత సంవత్సరం నుంచి విడివిడిగా ఉంటున్నారు. గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు కాపాడారు. ఈసారి మాత్రం ఆమె ప్రాణాలను రక్షించలేకపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.