IND vs ZIM : టీమిండియా సెమీస్ ఆశలు ఆ ‘4 గంటల’పైనే.. 1800 కిలోమీటర్ల దూరంలో అసలుసిసలు యుద్ధం
IND vs ZIM : చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్-జింబాబ్వే తలపడనున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో చెన్నై పిచ్‌పై భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. సెమీస్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ విషయంలో భారత్ ప్రస్తుతం వెనుకబడి ఉంది.

IND vs ZIM : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాకు ఇప్పుడు డూ ఆర్ డై సిట్యుయేషన్ ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, వరుసగా రెండోసారి టైటిల్ కొట్టాలన్న కసితో ఉంది. అయితే సూపర్ 8 రౌండ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చేసింది. ఈ నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 26) జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ సేనకు అత్యంత కీలకం. అయితే, చెన్నైలో భారత్ ఆడే మ్యాచ్ కంటే.. దానికి 4 గంటల ముందు 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌లో జరిగే మరో మ్యాచ్ ఫలితంపైనే భారత్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్-జింబాబ్వే తలపడనున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో చెన్నై పిచ్‌పై భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. సెమీస్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ విషయంలో భారత్ ప్రస్తుతం వెనుకబడి ఉంది. అయితే, భారత్ మ్యాచ్ ప్రారంభానికి ముందే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. గ్రూప్-1 పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న ఈ రెండు జట్ల మ్యాచ్ ఫలితం టీమ్ ఇండియా తలరాతను మార్చేయనుంది.
విచిత్రం ఏంటంటే.. తనను ఓడించిన సౌతాఫ్రికానే ఈ మ్యాచ్‌లో గెలవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకోవాల్సి వస్తోంది. లెక్కల ప్రకారం చూస్తే.. ఒకవేళ సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి, ఆ తర్వాత భారత్ తన మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిస్తే.. సెమీఫైనల్ బెర్తు ఎవరిదనేది భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే ఆఖరి మ్యాచ్‌తో తేలిపోతుంది. ఆ మ్యాచ్‌లో విండీస్‌పై గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. అలా కాకుండా, ఒకవేళ అహ్మదాబాద్‌లో వెస్టిండీస్ గెలిస్తే మాత్రం భారత్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
ఒకవేళ వెస్టిండీస్ గెలిచి, భారత్ కూడా జింబాబ్వేపై నెగ్గితే.. ఆఖరి రౌండ్ మ్యాచ్‌ల తర్వాత భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మూడు జట్లూ 4 పాయింట్లతో సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు సెమీస్ బెర్తును నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం రన్ రేట్ మైనస్‌లో ఉన్న భారత్, ఇంత మందిని దాటుకుని ముందుకు వెళ్లడం చాలా కష్టం. అందుకే, ఈ 4 గంటల సమయం, అహ్మదాబాద్ నుంచి వచ్చే రిజల్ట్ టీమిండియాకు అదృష్టం తెచ్చిపెట్టాలని కోట్లాది మంది అభిమానులు ప్రార్థిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
