Special Trains: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అభ్యర్థులకు శుభవార్త.. ఈ రూట్లలో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..

Railway News/ IRCTC: రైల్వే విభాగాల్లోని పలు పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (RRB) ఎన్టీపీసీ పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి దశ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో దఫా పరీక్షలు జరగనున్నాయి.

Special Trains: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అభ్యర్థులకు శుభవార్త.. ఈ రూట్లలో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..
Special Trains
Follow us

|

Updated on: Jun 09, 2022 | 3:13 PM

Railway News/ IRCTC: రైల్వే విభాగాల్లోని పలు పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (RRB) ఎన్టీపీసీ పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి దశ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో దఫా పరీక్షలు జరగనున్నాయి. ఈక్రమంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు. ఆయా రైళ్లను నడిపే తేదీలతో పాటు బయల్దేరే వేళలు, ఏయే స్టేషన్లలో ఆగుతాయి వంటి వివరాలను ఇందులో పేర్కొన్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.07169 నంబర్‌ గల రైలు గురువారం (జూన్‌9న) తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ఖాజీపేట చేరుకుంటుంది. రేణిగుంట, గుడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌ స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. 07448 నంబర్‌ గల రైలు శుక్రవారం (జూన్‌10న) ఖాజీపేట నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 10.30 గంటలకు నాగపూర్‌ చేరుకుంటుంది. అదేవిధంగా 07449 గల రైలు ఆదివారం (జూన్‌12) రాత్రి 10.30 గంటలకు బయలుదేరి సోమవారం సాయంత్రం 7 గంటలకు ఖాజీపేట చేరుకుంటుంది. పెద్దపల్లి, కరీంనగర్‌, లింగంపేట్‌, జగిత్యాల, కొరటాల, మెట్‌పల్లి, ఆర్మూర్‌, నిజామాబాద్‌, ముఖ్దేడ్‌, నాందేడ్‌, పూర్ణ, బస్మత్‌, హింగోలి, అఖోలా, బాంద్రా స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

ఇవి కూడా..ఇక 07450 నంబర్‌ గల రైలు శుక్రవారం (జూన్‌ 10) గుంటూర్ స్టేషన్‌ నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కొల్హాపూర్‌ చేరుకుంటుంది. అదేవిధంగా 07451 గల రైలు ఆదివారం (జూన్‌12) రాత్రి 9 గంటలకు కోల్హాపూర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు గుంటూర్‌ చేరుకుంటుంది. మిర్యాల గూడ, నల్గొండ, కాచిగూడ, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌, డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్పేట, గడగ్‌, హుబ్లీ, ధార్వాడ్‌, లోండా, బెళగావి, మిరాజ్‌ స్టేషన్లలో ఈ స్పెషల్‌ రైళ్లు ఆగనున్నాయి.

ఇవి కూడా చదవండి

గుంటూర్‌-భద్రక్‌ల మధ్య..

08401 గల స్పెషల్ ట్రైన్‌ శుక్రవారం (జూన్‌ 10)న రాత్రి 9 గంటలకు భద్రక్‌ స్టేష్‌ నుంచి బయలుదేరి శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు గుంటూర్‌ చేరుకుంటుంది. అదేవిధంగా 08402 నంబర్‌ గల రైలు శనివారం (జూన్‌11) రాత్రి 8 గంటలకు గుంటూర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు భద్రక్‌ స్టేషన్‌ చేరుకుంటుంది. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ స్పెషల్‌ ట్రైన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Basara RGUKT 2022: బాసర ఆర్జీయూకేటీ- 2022 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌.. త్వరలోనే..

Nayanthara Vignesh Wedding: మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమపక్షులు.. వైరలవుతున్న పెళ్లి ఫోటోస్..

NBK 107: బాలయ్య సినిమా టీజర్ రిలీజ్‏కు టైమ్ ఫిక్స్.. ఆయుధంతో బరిలోకి దిగనున్న నటసింహం..