AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నూనె తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ! నోరూరించే ‘పనీర్’ విందు.. అతిథుల కోసం 3 వెరైటీ స్నాక్స్

పండుగలు, శెలవులు వచ్చాయంటే సాయంత్రం ఏ వెరైటీ స్నాక్స్ చేయాలని లంచ్ టైమ్ నుంచే ప్లాన్ చేసేస్తాం. అటువంటిది ఇంటికి గెస్ట్‌లు వస్తున్నారు అంటే వాళ్లను ఇంప్రెస్ చేయడానికి లేదా వాళ్లతో కలిసి సరదాగా తినడానికి ఏదో ఒక స్పెషల్ స్నాక్స్ రెడీ చేసేస్తాం.

నూనె తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ! నోరూరించే ‘పనీర్’ విందు.. అతిథుల కోసం 3 వెరైటీ స్నాక్స్
Paneer Tikka & Baked Paneer Pakora.jpg
Nikhil
|

Updated on: Mar 04, 2026 | 6:55 AM

Share

పండుగ ఏదైనా ఇంట్లో పనీర్ వంటకం ఉంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా పండుగల సమయంలో అతిథులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించడంలో పనీర్ ముందుంటుంది. ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పనీర్ సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఈ హోలీ వేడుకల్లో మీ మెనూను మరింత కలర్ ఫుల్ గా మార్చే మూడు రకాల హై-ప్రోటీన్ పనీర్ స్నాక్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం..

పనీర్ టిక్కా

పెరుగు, సుగంధ ద్రవ్యాలతో మ్యాటినేట్ చేసిన పనీర్ ముక్కలను గ్రిల్ చేయడం వల్ల అది లోపల మెత్తగా, బయట కరకరలాడుతూ ఉంటుంది.

తయారీ విధానం:

పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, నిమ్మరసం, ఆవనూనె కలిపి పనీర్ ముక్కలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలను అందులో 30 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత వీటిని స్కేవర్లకు గుచ్చి ఓవెన్ లో 200 డిగ్రీల వద్ద 15-20 నిమిషాలు గ్రిల్ చేయాలి. దీనిని పుదీనా చట్నీతో తింటే ఆ రుచే వేరు.

బేక్డ్ పనీర్ పకోడా

పకోడా అనగానే నూనెలో వేయించినవి అనుకోవద్దు. ఇది బేక్ చేసిన హెల్తీ వర్షన్. శనగపిండి మిశ్రమంలో వాము, పసుపు, కారం కలిపి పనీర్ ముక్కలను అందులో ముంచాలి. వీటిని బేకింగ్ ట్రేలో ఉంచి 190 డిగ్రీల వద్ద 20-25 నిమిషాలు బేక్ చేస్తే క్రిస్పీ పకోడాలు రెడీ. నూనె వాడకం చాలా తక్కువ కాబట్టి ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

పనీర్ కాథీ రోల్

అతిథులకు వడ్డించడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. గోధుమ పిండితో చేసిన రోటీలలో మసాలా పనీర్, పచ్చి కూరగాయలు పెట్టి రోల్ చేయాలి. ఇందులో ఫైబర్ తో పాటు ప్రోటీన్ కూడా అందుతుంది. ఆకలిని త్వరగా తగ్గించి ఎక్కువ సేపు శక్తిని ఇస్తుంది.

ప్రోటీన్ తో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల అలసట లేకుండా ఉత్సాహంగా ఉండవచ్చు. పనీర్ తో చేసిన ఈ స్నాక్స్ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఈసారి మీ ఇంటికి వచ్చే అతిథులకు ఈ స్పెషల్ పనీర్ వంటకాలను వడ్డించి వారి ప్రశంసలు పొందండి.

Follow Us
టికెట్ ఉంటే సరిపోదు.. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇది తప్పనిసరి..
టికెట్ ఉంటే సరిపోదు.. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇది తప్పనిసరి..
ఇండస్ట్రీలో తనకున్న ఏకైక మిత్రుడు ఆయనే..
ఇండస్ట్రీలో తనకున్న ఏకైక మిత్రుడు ఆయనే..
బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో విరుచుకుపడ్డ భారత కెప్టెన్
బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో విరుచుకుపడ్డ భారత కెప్టెన్
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..
నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు
నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు
'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా?
'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా?
మిక్సీ సరిగ్గా తిరగడం లేదా.. జస్ట్ 2 నిమిషాల్లో ఇలా సెట్ చేయండి..
మిక్సీ సరిగ్గా తిరగడం లేదా.. జస్ట్ 2 నిమిషాల్లో ఇలా సెట్ చేయండి..
పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు
పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు