6 ఓవర్లకే 7 వికెట్లు.. 15 బంతుల్లో 48 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన ఆటగాడు ఎవరంటే..
Gloucestershire vs Somerset, T20 Blast 2022: టీ20 బ్లాస్ట్‌లో టోర్నీలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్ కూడా అభిమానులకు అసలైన మజాను అందించింది
Gloucestershire vs Somerset, T20 Blast 2022: టీ20 బ్లాస్ట్‌లో టోర్నీలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్ కూడా అభిమానులకు అసలైన మజాను అందించింది. గ్లౌసెస్టర్‌షైర్, సోమర్‌సెట్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగింది. ఒకే ఒక్క ఆటగాడు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను గెలిపించాడు. అతనే సోమర్ సెట్ ఆటగాడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ వాన్ డెర్ మెర్వే. గ్లౌసెస్టర్ షైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 15 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్‌షైర్ 101 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం సోమర్‌సెట్‌కు 112 పరుగుల లక్ష్యాన్ని విధించారు. సోమర్సెట్ 3 బంతులు మిగిలి ఉండగానే ఈ టార్గెట్‌ను అందుకుంది. అందుకు ప్రధాన కారణం వాన్ డెర్ మెర్వే ఆడిన మెరుపు ఇన్నింగ్సే.
తుపాన్ ఇన్నింగ్స్‌తో
112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్‌సెట్‌కు శుభారంభం దక్కలేదు. టామ్ బాంటన్ మొదటి బంతికే ఔట్‌కాగా విల్ స్మెల్ 5, రిలే రస్సో కూడా 7 పరుగులకే నిష్ర్కమించారు. కెప్టెన్ టామ్ అబెల్ కూడా 5 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆ జట్టు 6 ఓవర్లలో కేవలం 55 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో నిలిచింది. అయితే 8వ స్థానంలో వచ్చిన ఆల్ రౌండర్ రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే మొత్తం మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మెర్వ్ స్ట్రైక్ రేట్ 320. కాగా సోమర్‌సెట్‌కు విజయానికి చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరం కాగా.. హిగ్గిన్స్ వేసిన ఆ ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్, రెండో బంతికి సిక్స్ బాదాడు. మూడో బంతికి మరో బౌండరీ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. కాగా మెర్వ్, డేవీతో కలిసి అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 21 బంతుల్లో 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దక్షిణాఫ్రికాను విడిచిపెట్టి..
వాన్ డెర్ మెర్వే దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడాడు. ఆ తర్వాత అతను నెదర్లాండ్స్‌లో స్థిరపడ్డాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ తరపున T20 ప్రపంచ కప్ కూడా ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్, టీ20 బ్లాస్ట్‌లు ఆడుతున్నాడు.
Let’s take you back and relive last night’s stunning turnaround ball-by-ball…….
? Somerset are 56/7 from 6.1 overs ? Somerset need 56 from 3.5 overs ? RVDM is 2* and Davey 0*
Still can’t our heads around what happened next to be honest!!
⤵️⤵️⤵️#WeAreSomerset #GLOvSOM pic.twitter.com/gppNY7ZAPS
— Somerset Cricket ? (@SomersetCCC) June 10, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ENG vs NZ: క్రికెట్‌లో కరోనా ప్రకంపనలు.. మహమ్మారి బారిన పడ్డ మరో స్టార్ క్రికెటర్..