AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: డీకే లాంటి ఫినిషర్‌ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా? హార్దిక్‌పై మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌..

IND vs SA 2022: ఐపీఎల్‌లో బెస్ట్‌ ఫినిషర్‌గా పేరొందిన డీకే కేవలం 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేశాడు. అయితే చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్‌ పట్ల హార్దిక్‌ ప్రవర్తించిన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.

IND vs SA: డీకే లాంటి ఫినిషర్‌ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా? హార్దిక్‌పై మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌..
Ind Vs Sa
Basha Shek
|

Updated on: Jun 10, 2022 | 2:59 PM

Share

IND vs SA 2022: నిన్న ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా భారత్‌- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. 200కు పైగా పరుగులు చేసినప్పటికీ బౌలర్ల వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. గాయం కారణంగా కేఎల్‌ రాహుల్‌ తప్పుకోవడంతో ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 211పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో అందుకుంది. ఇక భారత ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ ( 48బంతుల్లో 76 పరుగులు.. 11ఫోర్లు, 3సిక్సర్లు) చెలరేగగా.. చివర్లో కెప్టెన్ రిషబ్ పంత్ ( 16బంతుల్లో 29పరుగులు.. 2ఫోర్లు, 2సిక్సర్లు), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( 12బంతుల్లో 31పరుగులు.. 2ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఇక ఈ మ్యాచ్‌లో చాలా రోజుల తర్వాత దినేశ్‌ కార్తీక్‌ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో బెస్ట్‌ ఫినిషర్‌గా పేరొందిన డీకే కేవలం 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేశాడు. అయితే చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్‌ పట్ల హార్దిక్‌ ప్రవర్తించిన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.

ఈ మ్యాచ్‌లో 17వ ఓవర్లో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా.. ఉన్నంత సేపు ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. కెప్టెన్ పంత్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.అయితే నోర్జే వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికి పంత్ ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి దినేష్ కార్తీక్ వచ్చాడు. రెండో బంతి ఎదుర్కొన్న అతను ఎలాంటి పరుగులు రాబట్టలేదు. మూడో బంతికి ఒక పరుగు వచ్చింది. ఆతర్వాత నాలుగో బంతికి హార్దిక్ సిక్స్ బాదాడు. ఇక అయిదో బంతికి నోర్జే యార్కర్‌ వేయగా హార్దిక్ డీప్ మిడ్ వికెట్ దిశగా బంతిని బాదాడు. అయితే అక్కడ సింగిల్ వచ్చే అవకాశమున్నా అవతలి ఎండ్‌లో ఉన్న డీకేను రావొద్దన్నాడు. తానే స్ట్రైక్ తీసుకున్నాడు. ఈక్రమంలో డీకే లాంటి ఫినిషర్‌కు సింగిల్‌ తీసి ఇవ్వకపోవడంపై పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. పోని చివరి బంతికేమైనా హార్దిక్‌ ఫోర్‌, సిక్స్‌ కొట్టాడా అంటే అది కూడా లేదు. కేవలం 2 పరుగులతో సరిపెట్టుకున్నాడు. దినేష్ కార్తీక్ ఏదో 10వ నంబర్ బ్యాటర్ అయినట్లు హార్దిక్ వ్యవహరించడం క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

RBI: ఆటో డెబిట్‌ పరిమితిని పెంచిన ఆర్బీఐ.. ఇక నుంచి ఓటీపీ కూడా అవసరం లేదట..!

PM Modi: ప్రధాని మోడీ ప్రయాణించే విమానం గురించి తెలుసా..? ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు ఇవే..

పుదీనా తైలంతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే షాకవ్వాల్సిందే..