Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆటో డెబిట్‌ పరిమితిని పెంచిన ఆర్బీఐ.. ఇక నుంచి ఓటీపీ కూడా అవసరం లేదట..!

ఆర్బీఐ ఆటో డెబిట్‌ అమౌంట్‌ లిమిట్‌ను పెంచింది. అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ అవసరం లేని ఆటో డెబిట్ లిమిట్‌ను రూ.5000 నుంచి రూ.15వేలకు పెంచింది...

RBI: ఆటో డెబిట్‌ పరిమితిని పెంచిన ఆర్బీఐ.. ఇక నుంచి ఓటీపీ కూడా అవసరం లేదట..!
Money
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 10, 2022 | 2:35 PM

ఆర్బీఐ ఆటో డెబిట్‌ అమౌంట్‌ లిమిట్‌ను పెంచింది. అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ అవసరం లేని ఆటో డెబిట్ లిమిట్‌ను రూ.5000 నుంచి రూ.15వేలకు పెంచింది. ఇప్పుడు విద్యుత్‌ బిల్లుల దగ్గర నుంచి గ్యాస్‌ బిల్లుల వరకు నెలవారీ ఖర్చులను చెల్లించేందుకు చాలా మంది డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల లేదా యూపీఐల ద్వారా ‘ఆటో డెబిట్‌ ఆప్షన్‌ ఉపయోగిస్తున్నారు. ఆటో డెబిట్‌ లావాదేవీలు పెరగడంతో వీటిని మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ గతేడాది అక్టోబరు నుంచి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం ఆటో డెబిట్‌ తేదీ, డెబిట్ అయ్యే నగదు మొత్తం వంటి వివరాలను కనీసం 24 గంటల ముందే బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారు అనుమతి అనంతరమే ఆటో డెబిట్‌ లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా రూ.5000లకు మించిన ఆటో డెబిట్‌ (Auto Debit) చెల్లింపులకైతే వినియోగదారులు.. వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)వంటి అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను మాన్యువల్‌గా చెప్పాలి.

అయితే కస్టమర్ల సౌకర్యార్థం ఈ పరిమితిని పెంచినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఇకపై ఆటో డెబిట్‌ చెల్లింపు మొత్తం రూ.15వేలు దాటితేనే కస్టమర్లను బ్యాంకులు అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషేన్ అడగాల్సి ఉంటుందన్నారు. రూ.15000 వరకు జరిపే ఆటో డెబిట్ లావాదేవీలకు ఎలాంటి ఓటీపీని ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ వెలువడనుందని వివరించారు. తాజా నిర్ణయంతో కస్టమర్లు ఎలాంటి ఓటీపీ నిబంధన లేకుండానే ఎడ్యుకేషన్‌ ఫీజులు, బీమా ప్రీమియంలు వంటి పెద్ద మొత్తాలను కూడా ఆటో డెబిట్‌పద్ధతిలో చెల్లించుకోవచ్చని చెప్పారు.