PM Modi: ప్రధాని మోడీ ప్రయాణించే విమానం గురించి తెలుసా..? ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు ఇవే..

VVIPల పర్యటనల కోసం, భద్రతా అవసరాలకు అనుగుణంగా భారత్.. 2018లో బోయింగ్ కంపెనీకి చెందిన రెండు 777 విమానాలను కొనుగోలు చేసింది.

PM Modi: ప్రధాని మోడీ ప్రయాణించే విమానం గురించి తెలుసా..? ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు ఇవే..
Boeing 777
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 10, 2022 | 1:36 PM

Air India One: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. నవ్‌సారిలో 3 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అక్కడికి చేరుకున్నారు. కాగా.. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. దీంతో అధునాతన బోయింగ్ విమానం మరోసారి వార్తల్లో నిలిచింది. బోయింగ్ 777 (Boeing 777)  విమానాలను ప్రధానమంత్రితోపాటు, రాష్ట్రపతి పర్యటనల కోసం ఉపయోగిస్తారు. VVIPల పర్యటనల కోసం, భద్రతా అవసరాలకు అనుగుణంగా భారత్.. 2018లో బోయింగ్ కంపెనీకి చెందిన రెండు 777 విమానాలను కొనుగోలు చేసింది. ఇవి అత్యున్నత ఆధునిక సాంకేతికతో కూడినవి. దీంతోపాటు ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకునేలా వీటిని తయారు చేశారు. ఈ ప్రత్యేకమైన ఎయిర్ ఇండియా వన్ విమానం.. ఫీచర్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి పర్యటనల కోసం ఈ బోయింగ్ విమానాన్ని అక్టోబర్ 2020లో ప్రారంభించారు. సాధారణ విమానాలతో పోలిస్తే ఈ విమానం ప్రత్యేక ఆధునాతన సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఈ సురక్షితమైన విమానం భారత వైమానిక దళానికి చెందినది. ఈ విమానం నిరంతరం సుదూర ప్రయాణాన్ని చేయగలదు. గాలిలోనే ఇంధనం నింపే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఉపయోగించే ఈ ప్రత్యేక విమానం అణు విస్ఫోటనం నుంచి కూడా తెలికగా బయటపడగలదు. దీంతోపాటు ప్రత్యేక రక్షణ కవచాన్ని కలిగి ఉంటుంది.

Pm Modi

Pm Modi

ఎయిర్ ఇండియా వన్ ఫీచర్స్ ఇవే..

ఇవి కూడా చదవండి
  1. రెండు ఎయిర్ ఇండియా వన్ విమానాలను తయారు చేసేందుకు భారత్ అమెరికాతో దాదాపు రూ.1,300 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.
  2. ఈ విమానం ట్విన్ GE90-115 ఇంజిన్‌లతో పనిచేస్తుంది. దీని సాయంతో ఈ ప్రత్యేక విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
  3. ఈ విమానానికి ‘సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్’ (SPS) కూడా ఉంటుంది. ఇది ఈ విమానాన్ని క్షిపణుల దాడి లేదా ఎలాంటి ప్రమాదం నుంచి అయినా సులువుగా రక్షిస్తుంది.
  4. ఈ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం.. క్షిపణి దాడికి ముందు సమాచారాన్ని అందించగల కొన్ని ప్రత్యేక సెన్సార్లను కలిగి ఉంది.
  5. విమానం ఈ ప్రత్యేక సెన్సార్ నుంచి సమాచారం అందుకున్న వెంటనే విమానం.. లోపల డిఫెన్సివ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.
  6. డిఫెన్సివ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్‌లో ఇన్‌ఫ్రా రెడ్ సిస్టమ్స్, డిజిటల్ రేడియో ఫ్రీక్వెన్సీ జామర్‌లు వంటి అనేక అధునాతన సాంకేతికతలు ఉన్నాయి.
  7. ఈ సాంకేతికతలన్నింటి కారణంగా ఎయిర్ ఇండియా వన్ శత్రువుల రాడార్‌ను జామ్ చేయగలదు. దీంతోపాటు క్షిపణి దాడులు కూడా చేయగలదు.
  8. ఎయిర్ ఇండియా వన్‌ విమానంలో క్వార్టర్స్, పెద్ద ఆఫీసు, ల్యాబ్, డైనింగ్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్ ఉన్నాయి. ఇది కాకుండా మెడికల్ ఎమర్జెన్సీల కోసం మెడికల్ సూట్ కూడా ఉంది.
  9. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే మార్గంలో ఇంధనం నింపుకోవడానికి ఈ ప్రత్యేక విమానం ఎక్కడా దిగాల్సిన అవసరం లేదు.
  10. ఈ విమానంలోని భద్రతా ఫీచర్లు, రక్షణా పరికరాలు అన్నీ అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని పోలి ఉంటాయి.
  11. విమానాన్ని నడిపేందుకు నలభై మంది సీనియర్ పైలట్లను కూడా దీనికోసం ఎంపిక చేశారు. ఈ 40 మంది పైలట్లు మాత్రమే ఈ రెండు బోయింగ్ 777 విమానాలను నడుపుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..