AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆత్మహత్యకు యత్నించిన ప్రేమికులు.. సీన్‌ కట్‌ చేస్తే.. ఆఖర్లో అదిరిపోయే ట్విస్ట్‌..

Uttar Pradesh: ఇద్దరూ తమ జీవిత భాగస్వాములను వదిలి కలిసి జీవించాలనుకున్నారు. అయితే సమాజ కట్టుబాట్ల కారణంగా అది సాధ్యపడలేదు. నిర్వేదానికి గురైన ఆ జంట.. కలిసి బతకలేకపోయామని తెలసి కలిసి చావాలని ఫిక్స్ అయ్యారు.

Viral News: ఆత్మహత్యకు యత్నించిన ప్రేమికులు.. సీన్‌ కట్‌ చేస్తే.. ఆఖర్లో అదిరిపోయే ట్విస్ట్‌..
Basha Shek
|

Updated on: Jun 09, 2022 | 4:27 PM

Share

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన చందు (30), ఓ మహిళ (32) చాలా కాలంగా ప్రేమించుకున్నారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. వీరిద్దరికి పెళ్లిళ్లైపోయాయి. మహిళకు ఆరేళ్ల కూతురు కూడా ఉంది. అయితే ప్రేమకు ఏదీ అడ్డుకాదంటూ ఒకరి మనసులు ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరూ తమ జీవిత భాగస్వాములను వదిలి కలిసి జీవించాలనుకున్నారు. అయితే సమాజ కట్టుబాట్ల కారణంగా అది సాధ్యపడలేదు. నిర్వేదానికి గురైన ఆ జంట.. కలిసి బతకలేకపోయామని తెలసి కలిసి చావాలని ఫిక్స్ అయ్యారు. యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే నది దగ్గరకు వెళ్లారు. అయితే అక్కడే వారి ప్లానింగ్‌ మారిపోయింది. మహిళ నదిలో దూకగా.. నీటి ప్రవాహానికి భయపడి చందు మాత్రం ఒడ్డునే ఉండిపోయాడు. అయితే ఈత వచ్చిన ఆ మహిళ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది.

నన్ను చంపేందుకు ప్రయత్నించాడు..

కాగా అక్కడి నుంచి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మహిళ తన ప్రియుడిపై కేసు పెట్టింది. తన ప్రియుడు తనను చంపేందుకు ప్రయత్నించాడంటూ, మొబైల్ ఫోన్ కూడా పగులగొట్టేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనకు కొన్ని వారాల క్రితమే పుణెకు వెళ్లి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు అతనిని కడిగిపారేసింది. పెద్దలు, కుటుంబ ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకున్నానని, భార్యకు విడాకులిచ్చి కచ్చితంగా తననే వివాహం చేసుకుంటానని ప్రేయసికి మాటిచ్చాడు. అయితే సమాజం తమ పట్ల చూపిస్తున్న విముఖత, వ్యతిరేకతను చూసి ఇద్దరూ ఆందోళనకు గురయ్యారు. కలిసి జీవించలేని చోట కలిసి తనువులు చాలిద్దామనుకున్నారు. అంతలోనే ఈ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మే 29న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

sai pallavi: కటిక చీకట్లను పక్కకి నెట్టే మిణుగురుల మెరిసిపోతున్న గోల్డెన్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి..

Nayanthara Vignesh Wedding: అంగరంగ వైభవంగా జరిగిన నయనతార, విఘ్నేష్‌ శివన్‌ వివాహం.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోస్

RBI Assistant Mains Results 2022: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అసిస్టెంట్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల..