AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Ramya: హీరోయిన్‌కు చేదు అనుభవం.. అసభ్యకర సందేశాలు పంపిన నెటిజన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ..

Actress Ramya: ప్రముఖ కన్నడ నటి రమ్య తెలుగువారికి కూడా పరిచయమే. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన అభిమన్యు సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు కన్నడ, తమిళ్‌ డబ్బింగ్ చిత్రాలతో ..

Actress Ramya: హీరోయిన్‌కు చేదు అనుభవం.. అసభ్యకర సందేశాలు పంపిన నెటిజన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ..
Actress Ramya
Basha Shek
|

Updated on: Jun 10, 2022 | 3:42 PM

Share

Actress Ramya: ప్రముఖ కన్నడ నటి రమ్య తెలుగువారికి కూడా పరిచయమే. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన అభిమన్యు సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు కన్నడ, తమిళ్‌ డబ్బింగ్ చిత్రాలతో మరింత చేరువైంది. ముఖ్యంగా సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ సినిమాలో రమ్య (Ramya) అభినయం అందరినీ ఆకట్టుకుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె రాజకీయాల్లో కూడా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. కాంగ్రెస్‌ ఎంపీగా సేవలందించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేసింది. దీంతో ఆమె మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటోన్న రమ్య సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటోంది. తన పర్సనల్‌ విషయాలతో పాటు ఫొటోలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే రమ్యకు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి తనని తరచూ ట్రోల్‌ చేస్తున్నాడని, అసభ్యకర కామెంట్స్‌ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది.

గతంలోనూ..

ఇవి కూడా చదవండి

కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి నటించిన చార్లీ 777 మూవీ నేడు(జూన్‌ 10) విడుదలైంది. నిన్న ఈ సినిమా ప్రివ్యూ చూసిన రమ్య.. సినిమా బాగుందంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. దీనికి ప్రీతమ్‌ ప్రిన్స్‌ అనే నెటిజన్‌ అశ్లీలమైన కామెంట్‌ చేశాడు. ఈక్రమంలోనే ప్రీతమ్‌ గతంలోనూ తనకు అసభ్యకర సందేశాలు పంపాడని, తరచూ ట్రోల్‌ చేస్తున్నాడంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది రమ్య. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ప్రీతమ్‌ ప్రిన్స్‌ వ్యక్తి ఎవరనేది తెలుసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ENG vs NZ: క్రికెట్‌లో కరోనా ప్రకంపనలు.. మహమ్మారి బారిన పడ్డ మరో స్టార్‌ క్రికెటర్‌..

IND vs SA: డీకే లాంటి ఫినిషర్‌ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా? హార్దిక్‌పై మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌..

Video viral: వావ్‌.. వాటే ఐడియా గురూ.. ! డ్రోన్ వాడకం మామూలుగా లేదులే!! చూశారంటే తప్పక ట్రై చేస్తారు..