Surya Kala |
Updated on: Jun 10, 2022 | 5:30 PM
రామ్ చరణ్.. ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒకటై ఈ నెల 14వ తేదికి దశాబ్దకాలం కానున్నది. ఈ నేపథ్యంలో ఈ జంట తమ పదో వివాహ వార్షికోత్సవాన్ని ఇటలీకి బయల్దేరారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్, ఉపాసన జంట జూన్ 10 శుక్రవారం చరణ్ - ఉపాసన జోడీ విదేశాలు వెళ్లారు. ఈ స్టార్ కపుల్ ఎయిర్ పోర్ట్ వద్ద కెమెరాకు చిక్కారు
జూన్ 14న ఈ జంట పెళ్లి రోజు. విదేశాల్లో తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం వెళ్లారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ కు విరామం ఇచ్చి.. తన భార్య ఉపాసనతో కలిసి విదేశీ పయనం అయ్యారు
శంకర్ దర్శకత్వంలో 'RC15' షూటింగ్‌లో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ డ్రామా చిత్రం జనవరి 2023 సంక్రాంతికి రిలీజ్ కానున్నదని టాక్. తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే