- Telugu News Photo Gallery Ind vs sa rishbah pant and virat kohli captainship coincidence indian cricket team in telugu
IND vs SA: అప్పుడు విరాట్.. ఇప్పుడు పంత్.. సేమ్ టు సేమ్ ఐదేళ్ల నాటి చరిత్ర రిపీట్..
యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు భారత టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.
Updated on: Jun 10, 2022 | 5:23 PM

తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టును దక్షిణాఫ్రికా ఓడించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ గాయపడటంతో రిషబ్ పంత్ తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్నాడు పంత్. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని ఆశ్చర్యకరమైన, యాదృచ్ఛిక సంఘటనలు చోటుచేసుకున్నాయి

కాగా పంత్ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్‌గా తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిపోయాడు. 2017లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో కోహ్లి తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

కోహ్లీ, పంత్‌లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోవడం యాదృచ్ఛికం. ఇద్దరూ తమ కెప్టెన్సీలో లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు.

ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పంత్ 29 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి T20I కెప్టెన్సీ మ్యాచ్‌లో కోహ్లీ కూడా 29 పరుగులు చేయడం గమనార్హం.

జూన్ 12న కటక్‌లో జరగనున్న రెండో మ్యాచ్‌లోనైనా పంత్ టీమిండియాను విజయాల బాటలో నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కే ఎల్ రాహుల్ గాయపడడంతో రిషభ్ పంత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.





























