Andhra Pradesh: తిరుపతిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. ఎన్టీఆర్ రాజుకు ఘన సన్మానం
తిరుపతి(Tirupati) లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యన్టీఆర్ అభిమాని అయిన ఎన్టీఆర్ రాజుకు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, బీజేపీ లీడర్ దగ్గుబాటి పురంధరేశ్వరి ఘనంగా సత్కరించారు. తిరుపతి అంటే...
తిరుపతి(Tirupati) లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యన్టీఆర్ అభిమాని అయిన ఎన్టీఆర్ రాజుకు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, బీజేపీ లీడర్ దగ్గుబాటి పురంధరేశ్వరి ఘనంగా సత్కరించారు. తిరుపతి అంటే ఎన్టీఆర్(NTR) గారికి చాలా ఇష్టమని, అందుకే ఆయన శతజయంతి వేడుకలను ఇక్కడ నిర్వహిస్తున్నామని పురంధరేశ్వరి చెప్పారు. సినీ, రాజకీయాల్లో ఎదురులేని వ్యక్తిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొన్న నటుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడైన ఎన్టీఆర్ ను గౌరవిస్తూ త్వరలో రూ.100 నాణెంపై ఆయన చిత్రాన్ని ముద్రించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. అంతే కాకుండా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని శతజయంతి ఉత్సవాలలో కొందరు ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుబాటి పురంధేశ్వరి సన్మానం చేశారు.
తిరుపతిలోని ఎన్టీఆర్ రాజు తమ కుటుంబానికి చాలా ఆప్తుడు అని వివరించారు. యన్టీఆర్ అభిమాని ఎలా ఉంటాడు అనే దానికి నిదర్శనమే ఎన్టీఆర్ రాజు అని కొనియాడారు. రాజు లాంటి అభిమానిని తాను ఇక జీవితంలో చూడలేనేమోనని చెప్పారు. ఎన్టీఆర్ రాజుకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి