AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: దట్టమైన అడవిలో శేష తీర్ధం.. అందమైన అనుభూతినిచ్చే ఈ తీర్ధాన్ని చేరుకోవాలంటే సాహసం చేయాల్సిందే..

తిరుమల అంటే ఒక్క శ్రీవారి ఆలయం మాత్రమే కాదు... చూడచక్కని అనేక ఇతర పుణ్యక్షేత్రాలు, పుణ్య తీర్ధాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి శేష తీర్ధం..శేష తీర్థం తిరుమల తీర్థాలన్నింట్లో అత్యంత ప్రమాదకరమైన జర్నీ అని చెప్పవచ్చు. ఈ శేష తీర్ధ చేరుకోవడం అత్యంత సాహసంతో కూడుకున్నది

Tirumala: దట్టమైన అడవిలో శేష తీర్ధం.. అందమైన అనుభూతినిచ్చే ఈ తీర్ధాన్ని చేరుకోవాలంటే సాహసం చేయాల్సిందే..
Sesha Theertham
Follow us
Surya Kala

|

Updated on: Jun 05, 2022 | 2:46 PM

Tirumala: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుమల తిరుపతి. ఇక్కడ సాక్ష్యాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని.. భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. స్వామివారి ఆలయం నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నచందంగా ఉంటుంది. అయితే తిరుమల అంటే ఒక్క శ్రీవారి ఆలయం మాత్రమే కాదు… చూడచక్కని అనేక ఇతర పుణ్యక్షేత్రాలు, పుణ్య తీర్ధాలు ఉన్నాయి.  వాటిల్లో ఒకటి శేష తీర్ధం.. కొండకోనల్లో కొలువైన ఈ తీర్ధం విశిష్టత.. ఎలా వెళ్ళాలి.. ఈరోజు తెలుసుకుందాం..

తిరుమల క్షేత్రానికి తూర్పుదిక్కున 10 కిలోమీటర్ల దూరంలో శేష తీర్థం ఉంది. అయితే నట్ట నడి అడవుల్లో ఉన్న ఈ శేష తీర్ధాన్ని దర్శించుకోవడం అత్యంత సాహసంతో కూడిన ప్రయాణం అని చెబుతున్నారు.  భక్తులు కాలి బాటన కొండకోనలను దాటుకుని.. నడుచుకుంటూ చేరుకోవాలి.  తిరుమల లోని పాచికాల్వ గంగమ్మ గుడి నుంచి భక్తులు తమ ప్రయాణం ప్రారంభించి..  సానరాళ్లమిట్ట, సోమిరెడ్డి గుంతలను దాటుకుంటూ.. పొలిగాడి శిల సున్నపురాయి కొండల మధ్యన నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం ఒక రావి చెట్టు దర్శనమిస్తుంది.. అక్కడ నుంచి చూస్తుంటే.. ఎడమవైపు ఒక లోయలో శేష తీర్ధం కనిపిస్తుంది. లోయలో కిందకు దిగి.. మధ్యలో కనిపించే మూడు నీటి ధారలను దాటి.. చివరి మడుగుకి చేరుకుంటాం.. ఇక్కడ తెప్పను ఉపయోగించి దాటుకుంటూ వెళ్తే.. మనకు ఎంతో పవిత్రమైన శేష తీర్ధం దర్శనం ఇస్తుంది.

ఇక్కడ అడవుల నుంచి పారే స్వచ్ఛమైన జలధారలు దర్శనమిస్తాయి. అంతేకాదు రాతి పై చెక్కిన వేంకటేశ్వరుని చిత్రం నాగుపాము చుట్ట చుట్టుకొన్న చిత్రాలు కనువిందు చేస్తాయి. సన్నని వెలుగు మధ్యన రాళ్ళ మధ్యన జాలు వారే నీళ్లను చూడాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాల్సిందే.. ఇక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

అయితే దట్టమైన అడవులు, ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించే చందనం చెట్లు, పెద్ద కొండలు సూర్యరశ్మి భూమి పైకి చేరకుండా చేసే.. చెట్లు పుట్టలు ఉంటాయి. కనుక ప్రయాణ సమయంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శేష తీర్థం తిరుమల తీర్థాలన్నింట్లో అత్యంత ప్రమాదకరమైన జర్నీ అని చెప్పవచ్చు. ఈ శేష తీర్ధ  చేరుకోవడం అత్యంత సాహసంతో కూడుకున్నది. ప్రమాదకరమైంది..  కష్ట తరమైనది కూడా ఎందుకంటే శేష తీర్ధ దర్శనానికి టీటీడీ అనుమతి తప్పని సరి.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే టీటీడీ అనుమతినిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.