Horoscope Today: ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.. సన్నిహితులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం రాశి ఫలాలు..

Horoscope Today: తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం ఎక్కువ మంది ఆశ్రయించేది రాశిఫలాలను. ఇప్పటికీ చాలా మంది రాశి ఫలాలను చూడడంతోనే రోజును మొదలు పెడతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు....

Horoscope Today: ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.. సన్నిహితులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం రాశి ఫలాలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 10, 2022 | 7:33 AM

Horoscope Today: తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం ఎక్కువ మంది ఆశ్రయించేది రాశిఫలాలను. ఇప్పటికీ చాలా మంది రాశి ఫలాలను చూడడంతోనే రోజును మొదలు పెడతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాశి ఫలాల ఆధారంగా పనులను వాయిదా వేయడమా.? లేదా కొనసాగించడమా.? అన్నదానిపై నిర్ణయాలు తీసుకుంటారు. మరి శుక్రవారం ద్వాదశ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.?

మేష రాశి..

మేష రాశి వారికి ఈరోజు శుభపరిణామం కనిపిస్తోంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా సాఫీగా అధిగమిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వృషభం..

వృషభ రాశి వారికి శుక్రవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా ఉండడం సూచించదగ్గ అంశం.

మిథునం..

మిథున రాశి వారు ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం..

ఈ రాశి వారికి శుక్రవారం శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. వీరికి వాహన యోగం కనిపిస్తోంది. అలాగే దూర ప్రాంతాల నుంచి శుభ వార్తలు తెలిసే అవకాశం కనిపిస్తోంది.

సింహం..

సింహ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్నిహితులతో మాటపట్టింపులు వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

కన్య..

కన్య రాశి వారికి శుక్రవారం మంచి పరిణామాలు గోచరిస్తున్నాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి..

ఈ రాశి వారికి శుక్రవారం సన్నిహితులతో విభేధాలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడే అవకాశాలు ఉన్నాయి. దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

వృశ్చికం..

వృశ్చిక రాశి వారికి ఈ రోజుల పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు..

ఈ రాశి వారికి శుక్రవారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో వేధిస్తోన్న రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తులు సమకూరే అవకాశాలు ఉన్నాయి.

మకరం..

మకర రాశి వారికి కొంత మేర ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో జాప్యం, ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం..

కుంభ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. సన్నిహితులతో విభేధాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

మీనం..

మీన రాశి వారికి పరిచయాలు విస్తృతమవుతాయి. మంచి శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?