చాణక్య నీతి : ఒక వ్యక్తిని నవ్వుల పాలు చేసే మూడు తప్పులు ఇవే!

Samatha

08 march 2026

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో గొప్ప విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

చాణక్యుడు తన కాలంలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు. అలాగే మానవవాళి సంక్షేమం కోసం ఆయన అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.

అత్యంత తెలివైన వ్యక్తిగా

చాణక్యుడి బోధనలు నేటి తరం వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి గొప్పగా బతకాలి అంటే కొన్ని తప్పులు చేయకూడదంట.

గొప్పగా బతకడం

ముఖ్యంగా ఒక వ్యక్తి తెలియక చేసే ఈ మూడు తప్పులు, తనను నవ్వులపాలు చేస్తాయని చెబుతున్నాడు చాణక్యుడు అవి ఏవి అంటే?

తెలియక చేసే తప్పులు

ఏ వ్యక్తి అయితే ప్రతి చిన్న విషయానికి కూడా ఆలోచించకుండా వాదిస్తాడో, అతను తమను తాము బలహీనులుగా నిరూపించుకుంటారంట.

చిన్న విషయాలకు వాదించడం

అలాగే, ఇతరుల అలవాట్లను కాపీ చేయడం, కేవలం ప్రదర్శన కోసమే మాట్లాడే వారు, సమాజంలో ఎగతాళి చేయబడతారని చెబుతున్నాడు చాణక్యుడు.

ఇతరుల అలవాట్లను కాఫీ చేయడం

అలాగే చాణక్య నీతి ప్రకారం, ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే వ్యక్తి, తమ సామర్థ్యాలకు మించి మాట్లాడే వ్యక్తి జీవితంలో నవ్వులపాలు అవ్వడం జరుగుతుందంట.

గొప్పలు చెప్పుకోవడం

అంతే కాకుండా ప్రతి దానిలో పాల్గొనడం, ఇతరులను ఆకట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేసే వ్యక్తి కూడా అందరి ముందు నవ్వుల పాలు కావడం జరుగుతుంది.

ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం