Women’s Day 2026: ఇందిరా గాంధీ నుంచి కల్పనా చావ్లా వరకు.. దేశ చరిత్రను తిరగరాసిన శక్తివంతమైన వీర నారీమణులు వీరే
gender equality is not a concession, but a collective benefit: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం యేటా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 2026 సంవత్సరానికి వియన్నాలోని OSCEకి UK ప్రతినిధి బృందం అధిపతి హాలండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. 'Give To Gain', 'లింగ సమానత్వంపై అర్ధవంతమైన పురోగతికి ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తుల సహకారం అవసరం' అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. మహిళల భద్రత, హక్కులు, నాయకత్వంపై పెట్టుబడి పెడితే అది మొత్తం సమాజాలను బలోపేతం చేస్తుంది. 'లింగ సమానత్వం అనేది రాయితీ కాదు, అదొక సమిష్టి ప్రయోజనం' అని ఆయన అన్నారు..

ఇందిరా గాంధీ నుంచి కల్పనా చావ్లా వరకు దేశంలో ఇప్పటి వరకు ఎందరో మహిశక్తి వంతమైన భారతీయ మహిళా మణులు ఒంటరిగా దేశ రాజకీయాలు, క్రీడలు, అంతరిక్షం, పర్వతారోహణ, న్యాయవ్యవస్థ వంటి పలు రంగాల్లో అడ్డంకులను బద్దలుకొట్టి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మహిళా హక్కుల ఉద్యమంతో పాటు సమానత్వం, విముక్తి కోసం మహిళలు చేసిన పోరాటాన్ని స్మరించుకునేందుకు యేటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD) జరుపుకుంటున్నాం. లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, దుర్వినియోగం వంటి అంశాలపై దృష్టి నిలిపేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
ఇందిరా గాంధీ – భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి (1966)
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ తన సొంత విజయాల ద్వారా దేశ చరిత్రలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. ఆమె భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుంచి 1977 వరకు, మళ్ళీ 1980 నుంచి 1984లో ఆమె హత్యకు గురయ్యే వరకు ప్రధాని పదవిలో పనిచేశారు. ఇందిరా గాంధీ భారత ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో బ్యాంకులను జాతీయం చేయడం, 1971 యుద్ధంలో దేశాన్ని ఒడిదుడుకులకు గురికాకుండ నడిపించడం వంటి పలు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు.
కరణం మల్లీశ్వరి – ఒలింపిక్ పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ
1975 లో జన్మించిన కరణం మల్లేశ్వరి ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె 2000 సిడ్నీ (ఆస్ట్రేలియా) లో జరిగిన ఒలింపిక్స్‌లో ఈ అద్భుతమైన విజయాన్ని సాధించారు. అక్కడ ఆమె స్నాట్చ్ 110 కిలోలు, ‘క్లీన్ అండ్ జెర్క్’ విభాగాలలో 130 కిలోలు మొత్తం 240 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నారు.
కల్పనా చావ్లా – అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారత సంతతి మహిళ (1997)
హర్యానాలోని కర్నాల్‌లో జన్మించిన కల్పనా చావ్లా 1988లో అమెస్ పరిశోధనా కేంద్రం నాసాలో చేరారు. 1997లో తన మొదటి అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. అప్పటిక ఆమె అనేక ప్రాజెక్టులలో పనిచేశారు. కొలంబియా స్పేస్ షటిల్ STS-87 విమానంలో ప్రయాణించేందుకు ఎంపిక చేసిన ఆరుగురు వ్యోమగామి బృందంలో ఆమె ఒకరు. STS-87 ప్రయోగంతో కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళగా గుర్తింపు పొందారు. ఈ మిషన్ విజయవంతమైన తర్వాత STS-107 సిబ్బందితో ఆమె రెండవ సారి అంతరిక్షయానానికి ఎంపికయ్యారు. కానీ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యల కారణంగా భూమికి తిరిగి వచ్చే క్రమంలో కల్పనా చావ్లా మృతి చెందారు.
బచేంద్రి పాల్ – ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ (1984)
బచేంద్రి పాల్ చిన్న వయసులోనే 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. మే 1984లో ఆరోహణను ప్రారంభించి.. మే 23 మధ్యాహ్నం 1:07 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుని బచేంద్రి పాల్ చరిత్ర సృష్టించారు. ఈ కలను సాధించేందుకు ఎంతో మంది యువతులకు ఆమె ప్రేరణగా నిలిచారు.
జస్టిస్ ఎం. ఫాతిమా బీవీ – భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి (1989)
1927లో జన్మించిన జస్టిస్ ఎం. ఫాతిమా బీవీ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. వాటిలో అతి పెద్దది 1989లో భారత సుప్రీంకోర్టుకు మొదటి మహిళ న్యాయమూర్తిగా ఎంపికవడం. దేశంలోని ఉన్నత న్యాయవ్యవస్థలకు నియమితులైన మొదటి ముస్లిం మహిళ కూడా ఈమె కావడం విశేషం. ఆమె సాధించిన విజయాలకు 2023లో కేరళ ప్రభుత్వం రెండవ అత్యున్నత గౌరవం అయిన కేరళ ప్రభ అవార్డుతో ఆమెను సత్కరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




