Black Garlic Benefits: డయాబెటీస్, హృదయ సమస్యలకు దివ్వౌషధం బ్లాక్ గార్లిక్..

Black Garlic Benefits: నల్ల వెల్లుల్లి జెల్లీలా సాగుతుంది. తీపి రుచి కలిగి ఉంటుంది.. ఘాటు వాసన ఉండదు. ఈ నల్లవెల్లుల్లిని జపాన్‌, థాయ్‌ల్యాండ్‌, దక్షిణ కొరియాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Black Garlic Benefits: డయాబెటీస్, హృదయ సమస్యలకు దివ్వౌషధం బ్లాక్ గార్లిక్..
Black Garlic Benefits
Follow us

|

Updated on: Jun 10, 2022 | 6:46 PM

Black Garlic Benefits: మన వంట ఇల్లే ఓ ఔషధాల గని.. లవంగాలు, వెల్లుల్లి, యాలకులు వంటి మసాలా దినుసులు ఆరోగ్యగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే.. అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది, అయితే నల్ల వెల్లుల్లి ఇంకా  ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. లవంగాల వంటి ముదురు రంగు, ముడతలు నిండిన రెబ్బలతో మృదువుగా ఉంటాయి . అంతేకాదు ఈ నల్లవెల్లుల్లి చాలా ఖరీదైనవి. కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి. ఈ రోజు నల్ల వెల్లుల్లి అంటే ఏమిటి.. ఇది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

నల్లవెల్లుల్లి తయారీ 

ఈ నల్ల వెల్లుల్లి ప్రత్యేకంగా పండదు. ఒక పద్ధతిలో నిల్వచేయడం లేదా తేమని నియంత్రించి అధిక ఉష్ణోగ్రతకు గురిచేయడం ద్వారా నల్లబడేలా చేస్తారు. ఈ ప్రాసెస్ లో నల్లవెల్లుల్లి తయారవడానికి మూడు వారాల సమయం పడుతుందట. ఇలా తయారైన నల్ల వెల్లుల్లి జెల్లీలా సాగుతుంది. తీపి రుచి కలిగి ఉంటుంది.. ఘాటు వాసన ఉండదు. ఈ నల్లవెల్లుల్లిని జపాన్‌, థాయ్‌ల్యాండ్‌, దక్షిణ కొరియాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

నల్ల వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలంటే..?

చాలా మంది నల్ల వెల్లుల్లిని భయపెడుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ నల్లవెల్లుల్లిని సర్వసాధారణముగా వంటల్లో ఉపయోగించరు.  ముఖ్యంగా దీనిని ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం ఒక కారణం కావచ్చు.. నిజానికి, ఇది చాలా రుచికరమైనది. ఉపయోగించడానికి చాలా సులభమైన పదార్ధం.

ఎందుకంటే నల్లవెల్లిని డైరెక్ట్ గా తినడానికి ఉపయోగించవద్దు.. ఇవి లవంగాల్లా చాలా మృదువుగా ఉంటాయి, టోస్ట్ వంటి వాటిపై గార్నిష్ చేస్తారు. అంతేకాదు వీటిని శాండ్‌విచ్‌లపై లేదా డిప్పింగ్ లేదా ఫినిషింగ్ సాస్‌లో ఉపయోగిస్తారు. వీటికి అదనపు తీపి రుచిని తీసుకుని రావడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో తయారుచేసిన సలాడ్ డ్రెస్సింగ్‌లకు నల్ల వెల్లుల్లి మంచి లుక్ ని తీసుకుని వస్తుంది.

నల్లవెల్లుల్లిని ఉపయోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

నల్ల వెల్లుల్లి రుచి ఇతర పదార్ధాలతో సులభంగా కలిసి పోతుంది. ముఖ్యంగా ఇవి చాలా ఖరీదైనది. కనుక నల్లవెల్లుల్లిని ఇతర మసాలా పదార్ధాలతో కలిపి ఉపయోగించడం వలన దీని రుచి తెలియదు. పిండి పదార్ధాలు, మాంస పదార్ధాలు అందంగా మెరుస్తూ కనిపించడానికి నల్ల వెల్లుల్లిని ఉపయోగించి కాన్వాసులను తయారు చేస్తారు. ఇది పొడి రూపంలో కూడా లభిస్తుంది. సీజన్ సాస్‌లు, సూప్‌లు వంటి ఆహారపదార్ధాలు కొంచెం ఎక్కువ ఉపయోగిస్తారు.

సాంప్రదాయ వైద్యంలో 

ఈ నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ప్రొటీన్‌, పీచు, ఐరన్‌, విటమిన్‌-సి, కాల్షియం కూడా అధిక శాతంలోనే ఉంటాయి.చైనీస్ వైద్యంలో ఉదర సంబంధిత వ్యాధులను నయం చేయడానికి బ్లాక్ వెల్లుల్లిని ఉపయోగిస్తారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఇది అతిసారం ఉన్న రోగులకు ఇవ్వబడుతుంది. కడుపులో నులి పురుగులతో ఇబ్బంది పడేవారికి మంచి ఆహారం. భారతదేశంలో, ఇది అలసట, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..