Poha Benefits: రైస్ కంటే ఆరోగ్యాన్ని ఇచ్చే అటుకులు.. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం..

పోహా రుచికరమైన, ఆరోగ్యాన్ని ఇచ్చే సంపూర్ణ సమతుల్యతను ఇచ్చే దేశీ ఆహారం. అన్నం కంటే పోహా ఎందుకు మేలు చేస్తుందో .. పోహా వల్ల మీరు పొందగల ప్రయోజనాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

Poha Benefits: రైస్ కంటే ఆరోగ్యాన్ని ఇచ్చే అటుకులు.. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం..
Poha Health Benefits
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2022 | 5:46 PM

Poha Health Benefits: ప్రజలకు ఆరోగ్యం పట్ల.. తినే ఆహారం పట్ల శ్రద్ధ పెరిగింది.  ముఖ్యంగా కరోనా అనంతరం రోగనిరోధక శక్తిపై దృష్టి పెట్టడమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక రోజు ఉదయం తినే  అల్పాహారంలో కూడా భిన్నంగా ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని తినడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. ముఖ్యంగా రుచికరంగా పోషకాలు ఉండే ఆహారం తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలలో అల్పాహారంగా తినే అటుకులు గురించి తెలుసుకుందాం. ఈ అటుకులను దేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. మధ్య ప్రదేశ్, ఢిల్లీ తెలుగు రాష్ట్రాలతో సహా అనేక ప్రాంతాల్లో పోహాని టిఫిన్ గా తీసుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఇండోరి పోహా పేరుతో స్టాళ్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. కొంతమంది అటుకులను సలాడ్ , మొలకలు కలుపుకుని మధ్యాహ్న భోజనంలో తింటారు.  అయితే అన్నం కంటే.. అటుకులు ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. కొంతమంది అన్నం తినడానికి ఇష్టపడతారు.. కానీ రైస్ లో కొన్ని గుణాలు శరీరానికి హాని కలిగిస్తాయని.. కనుక రైస్ బదులు పోహాని తినమంటూ పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. పోహా రుచికరమైన,  ఆరోగ్యాన్ని ఇచ్చే సంపూర్ణ సమతుల్యతను ఇచ్చే దేశీ ఆహారం. అన్నం కంటే పోహా ఎందుకు మేలు చేస్తుందో .. పోహా వల్ల మీరు పొందగల ప్రయోజనాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

ప్రోబయోటిక్ ప్రయోజనాలు అటుకులు గొప్ప లక్షణం ఏమిటంటే.. ఇవి కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేయబడతాయి. అటుకుల్లో గ్లూకోజ్ గాని, కొవ్వు పదార్దాలు కాని ఉండవు. పిండిపదార్థాలు, ఖనిజాలూ, విటమిన్లూ, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అటుకులలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతాయి. దీంతో ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇనుము:  అతుకుల్లో ఇనుము  అధికంగా ఉటుంది. గర్భిణీ స్త్రీలు ఐరెన్ లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి అటుకులను ప్రతి రోజూ కొంచెం మోతాదులో తినడం మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక అటుకులకు నిమ్మరసం జత చేసి తినడం వలన విటమిన్ సి కూడా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది పోహా మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.  అన్నం తినకూడదని లేదా తక్కువ తినే డయాబెటిక్ రోగులకు పోహా బెస్ట్ ఆప్షన్. పోహాను దేశీ స్టైల్‌లో తయారు చేసుకుంఇ తినడం వలన మరింత ఆరోగ్య ప్రయోజనకరమని చెబుతున్నారు. నిజానికి..అటుకులను కూరగాయలతో పాటు.. పోపు వేసుకుని రుచికరమైన పోహా ను తయారు చేసుకుని తినడం వలన రుచికి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది.

Note :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..