Ayurveda Health Tips: పెరుగుని ఇష్టారీతిలో తింటున్నారా.. అయితే ఈ నియమాలు పాటించాల్సిందే.. అంటోన్న ఆయుర్వేదం

Ayurveda Health Tips: గోరువెచ్చని పాలలో మజ్జిగ(Butter Milk) చుక్కలను వేస్తే పెరుగు ఏర్పడుతుంది. ఈ పెరుగు (Curd) ఎలాంటి వాత వ్యాధినయినా నయం చేస్తుంది. బరువును పెంచుతుంది. శరీరానికి పుష్టిని కలిగిస్తుంది..

Ayurveda Health Tips: పెరుగుని ఇష్టారీతిలో తింటున్నారా.. అయితే ఈ నియమాలు పాటించాల్సిందే.. అంటోన్న ఆయుర్వేదం
Curd How To Eat Ayurveda
Follow us
Surya Kala

|

Updated on: Apr 17, 2022 | 6:59 PM

Ayurveda Health Tips: గోరువెచ్చని పాలలో మజ్జిగ(Butter Milk) చుక్కలను వేస్తే పెరుగు ఏర్పడుతుంది. ఈ పెరుగు (Curd) ఎలాంటి వాత వ్యాధినయినా నయం చేస్తుంది. బరువును పెంచుతుంది. శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. అయితే ఈ పెరుగును వేసవి కాలంలో తీసుకోవడం మంచిది కాదని.. శీతాకాలం , వర్షాకాలంలో అదీ పగటి పుట తెసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది.  పెరుగు పగలు తీసుకోవచ్చు. అయితే ఈ పెరుగును చాలా మంది నియమాలు పాటించడకుండా ఇష్టమైన రీతిలో తింటారు.. దీనివలన అనేక రోగాల బారిన పడుతున్నారు. ఈరోజు పెరుగును తినే విషయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం..

పెరుగు తినేవారు పాటించవలసిన నియమాలు: 

పెరుగుని కోడిమాంసాన్ని కలిపి తినవద్దు పెరుగుని నిమ్మపండు కలిపి తినవద్దు పెరుగుతో అరటిపండు భుజించరాదు . వేడివేడి అన్నంలో పెరుగు వేసుకుని తినరాదు. ముఖ్యంగా రాత్రివేళ పెరుగు తినవద్దు. దీనివలన శరీరంలో కఫం పెరుగుతుంది. జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడతాయి.

పగలు పెరుగు తినే సమయంలో గుర్తు పెట్టుకోవాలిన నియమాలు: 

తేనె తో కలిపిన పెరుగు మంచి రుచినిస్తుంది. ఉసిరి పచ్చడి పెరుగు  తినడం వలన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. నెయ్యి ,చక్కెర, పెరుగు ఈ మిశ్రమం వాతాన్ని తగ్గిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది చక్కెర ,పెరుగు కలిపిన మిశ్రమం దప్పిక, తాపాన్ని హరిస్తుంది. పెసరపప్పు ,పెరుగు కలిపి తింటే రక్తంలోని వాతాన్ని హరిస్తుంది.

Also Read: Telangana: కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం .. న్యాయం చేయాలని డీకే అరుణ డిమాండ్

Note :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.