Telangana: కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం .. న్యాయం చేయాలని డీకే అరుణ డిమాండ్

Telangana: ఇటీవల రామయంపేట్ లో తల్లి కొడుకుల ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త మృతిపై బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న అరాచకాలను

Telangana: కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం .. న్యాయం చేయాలని డీకే అరుణ డిమాండ్
Dk Aruna
Follow us

|

Updated on: Apr 17, 2022 | 6:36 PM

Telangana: ఇటీవల రామయంపేట్ లో తల్లి కొడుకుల ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త మృతిపై బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న అరాచకాలను బీజేపీ కార్యకర్త సాయి గణేష్ వెలుగులోకి తెస్తుండటంపై సాయి గణేష్ మీద కక్ష పెంచుకున్నారని.. పోలీసుల సహాయంతో అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు. పోలీసుల వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురైన.. సాయి గణేష్ పోలీసు స్టేషన్ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. మూడు వారాల్లో పెళ్లి పీటలెక్కాల్సిన సాయి గణేష్ మృతి చెందడం బాధాకరమన్నారు అరుణ.

చికిత్స పొందుతూ సాయి గణేష్ మీడియా కు ఇచ్చిన వాంగ్మూలంలో తన ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయ్, పోలీసు అధికారులు కారణమని స్పష్టం చేశాడు. కనుక వెంటనే పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సాయి గణేష్ మృతికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్, పోలీసు అధికారులపై హత్యనేరం కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి కొడుకుల ఆత్మహత్యలకు కారణమైన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, రామయంపేట్ మాజీ సిఐ తో పాటు ఆత్మహత్యకు కారణమైన ఏడుగురిపై కూడా హత్యానేరం కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామని డీకే అరుణ హెచ్చరించారు.

ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులే వారి మృతులకు కారణమవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతూ, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. తమ సహనాని పరీక్షించ వద్దని, సహనానికి కూడా హద్దులు ఉంటాయని టిఆర్ఎస్ నాయకులూ గుర్తించుకోవాలని అన్నారు అరుణ.

Also Read: US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 12మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు