Telangana: తల్లీ కూతుళ్లతో వ్యక్తి ఎఫైర్.. ఆపై ఊహించని ఇన్సిడెంట్.. విచారణలో విస్తుపోయే నిజాలు

మెదక్ జిల్లాలో సంచలన కేసు వెలుగుచూసింది. 2  రెండు రోజుల క్రితం జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును చేస్తున్న క్రమంలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

Telangana: తల్లీ కూతుళ్లతో వ్యక్తి ఎఫైర్.. ఆపై ఊహించని ఇన్సిడెంట్.. విచారణలో విస్తుపోయే నిజాలు
Extra Marital Affair
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 17, 2022 | 5:57 PM

Medak district: మెదక్ జిల్లాలో సంచలన కేసు వెలుగుచూసింది. 2  రెండు రోజుల క్రితం జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును చేస్తున్న క్రమంలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును చేధించారు. అందుకు సంబంధించిన వివరాలను మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు తెలిపారు. జిల్లాలోని చేగుంట మండలం(Chegunta Mandal) వల్లూరు గ్రామానికి చెందిన శంభుని యాదమ్మ, ఆమె తనయ సంతోష ఏప్రిల్ 10న చేగుంటకు పలు వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. పలు చోట్ల ఎంక్వైరీ చేసినా.. ఆచూకీ తెలియలేదు.  దీంతో ఆమె భర్త పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్ చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ క్రమంలో పోలీసులుకు ఏప్రిల్ 15న ఓ ఫోన్ కాల్ వచ్చింది. వడియారం అటవీ ప్రాంతంలో 2 గుర్తు తెలియని డెడ్ బాడీలు ఉన్నాయని ఆ కాల్ సమాచారం. వెంటనే స్పాట్‌కు  చేరుకున్న పోలీసులు.. మృతులు యాదమ్మ, సంతోషగా ఐడెంటిఫై చేశారు. కేసును సాల్వ్  చేసేందుకు పోలీసులు తమ మార్క్ ఐడియాలజీ ఉపయోగించారు. ఈ క్రమంలోనే వడియారం గ్రామానికి చెందిన మరికింది నగేశ్​పై డౌట్ వచ్చింది. అదుపులోకి తీసుకొని విచారించంగా ఇద్దర్నీ తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు.

నగేశ్​కు గతంలో తల్లీ కూతుళ్లతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వారు నిందితుడిని డబ్బులు ఇవ్వాలని వేధించారు. తాము అడిగినంత ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారు. దీంతో నగేశ్ ఎలాగైనా వారి పీడ తొలగించుకోవాలని ఫిక్సయ్యాడు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి వడియారం అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ లిక్కర్ సేవించారు. ఆ మత్తులోనే నగేశ్​ తల్లికూతుళ్లను గొంతు నులిమి హత్యచేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్పీ వివరించారు.

Telangana Crime News

Also Read: Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?