Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?

ఇంటర్నెట్ అప్‌గ్రేడ్ అవ్వడంతో ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించిన  లేటెస్ట్ అప్‌డేట్స్.. వారి లైఫ్‌లోని అన్ని విషయాలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు అంటే పేపర్ ద్వారా వార్తలు తెలిసేవి.. కానీ ఇప్పుడు క్షణాల్లో ప్రతి విషయం జనానికి తెలిసిపోతుంది.

Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు... ఎవరో గుర్తించారా..?
Hero Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 17, 2022 | 1:31 PM

Trending Photo: సెలబ్రిటీలు ఒక్క ఫోటో షేర్ చేసినా చాలు సోషల్ మీడియా(Social Media) షేక్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించని జనాలు చాలా అరుదు. దీంతో అభిమాన నటీనటుల ఫోటోలకు  లైక్స్‌, షేర్స్‌తో హోరెత్తించి.. ట్రెండ్ అయ్యేందుకు ట్రై చేస్తారు ఫ్యాన్స్. ఇంటర్నెట్ అప్‌గ్రేడ్ అవ్వడంతో ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించిన  లేటెస్ట్ అప్‌డేట్స్.. వారి లైఫ్‌లోని అన్ని విషయాలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు అంటే పేపర్ ద్వారా వార్తలు తెలిసేవి.. కానీ ఇప్పుడు క్షణాల్లో ప్రతి విషయం జనానికి తెలిసిపోతుంది. సీనియర్స్, జూనియర్స్ అన్న తేడా లేదు. అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు.  సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా.. తమ అభిమానులతో స్పెషల్ లైవ్ చిట్‏చాట్స్ నిర్వహిస్తూ.. వారికి మరింత దగ్గరవుతున్నారు. ‘త్రోబ్యాక్’ పిక్స్(Throwback pics) షేర్ చూస్తూ.. తమ బాల్యపు గుర్తులను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజా ఓ హీరో చిన్ననాటి ఫోటో తెగ ట్రెండ్ అవుతోంది. అతడెవరో కాదు.. హీరో సిద్దార్థ్. ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాల ద్వారా ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు సిద్దూ. పక్కింటి కుర్రాడిలా కనిపించే ఈ హీరో.. రొమాంటిక్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.  చదువు కంప్లీట్ కాగానే మణిరత్నం వంటి క్రియేటివ్ దర్శకుడి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. మణిరత్నం తెరకెక్కించిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’కు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. ఆ మూవీలో ఓ సీన్ లో తళుక్కున మెరిశాడు కూడా. ఆ తరువాత  శంకర్ తీసిన ‘బోయ్స్’ మూవీతో సిద్ధార్థ్ హీరోగా మారాడు. మణిరత్నం రూపొందించిన ‘యువ’లోనూ కీ రోల్ పోషించాడు. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవకాశం రాలేదు.  ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తెలుగునాట స్టార్ హీరో అయిపోయాడు సిద్దూ.  బొమ్మరిల్లు, చుక్కల్లో చంద్రుడు, ఆట, కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, ఓయ్, అనగనగా ఓ ధీరుడు, బావ, ఓ మై ఫ్రెండ్, జబర్దస్త్.. వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ ‘బాద్ షా’లో యన్టీఆర్ స్నేహితుడిగా కనిపించాడు.

కేవలం యాక్టర్‌గా మాత్రమే కాదు.. నిర్మాతగా, రచయితగా తనలోని మల్టీ టాలెంట్ చూపించాడు. తెలుగులో కాస్త గ్యాప్ తీసుకున్న అనంతరం గత ఏడాది ’మహాసముద్రం’ అనే ద్విభాషా చిత్రం ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం మూడు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు సిద్ధార్థ్. అన్నట్లు ఈరోజు సిద్దూ బర్త్ డే. ఈ క్రమంలో ఈ హీరో చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. అతనికి ఇండస్ట్రీలో మరన్ని విజయాలు దక్కాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే సిద్దూ.

Also Read: IPL 2022: సింగిల్ హ్యాండ్‌తో కోహ్లీ స్టన్నింగ్‌ క్యాచ్‌… అవాక్కయిన అనుష్క

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!