US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 12మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

US Shooting: అగ్రరాజ్యంలో అమెరికా(America)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా (South Carolina) రాష్ట్రంలోని కొలంబియా(Columbia )నగరంలో కాల్పులు జరిగాయి. స్థానికంగా నిత్యం రద్దీగా..

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 12మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
South Carolina Mall Shootin
Follow us
Surya Kala

|

Updated on: Apr 17, 2022 | 5:55 PM

US Shooting: అగ్రరాజ్యంలో అమెరికా(America)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా (South Carolina) రాష్ట్రంలోని కొలంబియా(Columbia )నగరంలో కాల్పులు జరిగాయి. స్థానికంగా నిత్యం రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో కాల్పులు జరిగాయని కొలంబియా పోలీస్ అధికారులు చెప్పారు. ఈ ఘటనలో  మొత్తం 12 మంది గాయపడ్డారని అయితే ఎవరూ మరణించలేదని.. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రసారమైన శనివారం బ్రీఫింగ్ సందర్భంగా పోలీసు చీఫ్ విలియం “స్కిప్” హోల్‌బ్రూక్ విలేకరులతో మాట్లాడుతూ.. కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని చెప్పారు. ఈ  కాల్పుల్లో 12మంది గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బాధితుల వయస్సు 15 నుంచి 75 మధ్య ఉంటుందని న్నారు ఘటన అనంతరం ఆయుధాలు కలిగి ముగ్గురు నిందితులను కొలంబియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు విచారిస్తున్నారు. కాల్పులు జరిగే సమయంలో మాల్‌లో భారీ సంఖ్యలో జనాలు ఉన్నారని, అందుకే పథకం ప్రకారం దుండగులు కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు కాల్పులకు.. కొంతమంది బాధితులకు ఒకరికొకరు తెలుసు అని తాము నమ్ముతున్నామని.. ఈ కాల్పులకు ఏదో కారణం ఉందని తాము భావిస్తున్నట్లు పోలీస్ అధికారి చెప్పారు.

Also Read: Boris Johnson tour: ఏప్రిల్ 21 న భారత్‌కు యూకే ప్రధాని జాన్సన్.. గుజరాత్‌లో పర్యటించనున్న మొదటి బ్రిటిష్ ప్రధాని!

Mahabharata: నాకే ఎందుకు ఇలా అన్న కర్ణతో.. జీవితం ఎవరికి ఈజీ కాదు.. నా జీవితమే అందుకు ఉదాహరణ అన్న శ్రీకృష్ణ