AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabharata: నాకే ఎందుకు ఇలా అన్న కర్ణతో.. జీవితం ఎవరికి ఈజీ కాదు.. నా జీవితమే అందుకు ఉదాహరణ అన్న శ్రీకృష్ణ

Karma Siddhanta:హిందూ సనాతన ధర్మంలో కర్మం సిద్ధాంతాన్ని నమ్ముతారు.. రాముడుగా వాలిని చంపిన పాపం.. కృష్ణుడుగా అనుభవించడానికి.. దేవుళ్ళకే వారి చేసిన పనులతో కష్టాలు బాధలు తప్పలేదని.. Life is Not Fair on Anybody : Sri Krishna conversation with Karna

Mahabharata: నాకే ఎందుకు ఇలా అన్న కర్ణతో.. జీవితం ఎవరికి ఈజీ కాదు.. నా జీవితమే అందుకు ఉదాహరణ అన్న శ్రీకృష్ణ
Sri Krishna Conversation Wi
Surya Kala
|

Updated on: Apr 17, 2022 | 5:28 PM

Share

Mahabharata: హిందూ సనాతన ధర్మంలో కర్మం సిద్ధాంతాన్ని నమ్ముతారు.. రాముడుగా వాలిని చంపిన పాపం.. కృష్ణుడుగా అనుభవించడానికి.. దేవుళ్ళకే వారి చేసిన పనులతో కష్టాలు బాధలు తప్పలేదని.. మానవులం మనము ఎంత అనుకుంటారు. అందుకనే చేసే పనిని.. మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని పురాణాలు పేర్కొన్నాయి. మనం చేసే మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. కర్మ (Karma Siddhanta) అంటే మానసికంగా గాని, శారీరకంగా గాని చేసింది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమతంలో విశ్వాసం. ఇదే విషయాన్నీ మహాభారతంలోని ఇద్దరు మహోన్నతులైన శ్రీకృష్ణుడు (Sri Krishna), కర్ణుడి(Karnudu) మధ్య చర్చ జరిగినప్పుడు.. తనకు కర్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతానికి శ్రీకృష్ణుడు చెప్పిన పాజిటివ్ థింకింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాం..

మహాభారతంలో మహోన్నత వ్యక్తులు శ్రీష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది. అప్పుడు కర్ణుడు.. శ్రీ కృష్ణుడిని తన జన్మ గురించి తన కష్టాలు గురించి ప్రస్తావించాడు. కృష్ణా.. నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది.. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పుడు కాదు. అయితే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో.. విద్య నేర్చుకునే అర్హత లేదంటూ ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకునిరాకరించారు. పరశురాముడు గురువై నాకు విద్యనైతే నేర్పారు. కానీ నేను క్షత్రియుడి గుర్తింపబడిన అనంతరం ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు. ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. అప్పుడు నా తల్లి ఎప్పుడూ లోకానికి నిజం చెప్పడానికి ముందుకురాలేదు.

అయితే కురుక్షేత్ర యుద్ధ సమయంలో కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పింది. దీని  వెనకనున్న కారణం కేవలం తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే. అయితే నేను ఏదైనా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే.. అందుకనే దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని కర్ణుడు.. శ్రీకృష్ణ పరమాత్ముడిని అడిగాడు.

అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం 

కర్ణా నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను. నా జన్మ కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది. పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడ్డాను. నువ్వు చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు… కానీ నేను గోశాలలో పేడ వాసనల మధ్యన జీవించాను. నా చిన్నప్పుడు.. నన్ను చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు.. వాటన్నిటిని ఎదుర్కొన్నాను. నా చుట్టూ ఏ సమస్య ఏర్పడినా నేనే కారణం అని నన్ను నిందించేవారు.. నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు..

నేను 16ఏళ్ల వయసప్పుడు సాందీపుని రుషి వద్ద విద్య నేర్చుకోవడం ప్రారంభించాను. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు. నేను నాకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను. అంతేకాదు నన్ను వివాహం చేసుకున్నవారు.. వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ.. జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది. ఆ సమయంలో అందరూ నన్ను పిరికివాడు అన్నారు.

అదంతా సరే.. దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధంలో గెలిస్తే.. నీకు మంచి పేరు వస్తుంది. కానీ నాకు ధర్మరాజు గెలిస్తే.. ఏమీ రాదు. ఈ యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నిందలు నా సొంతం.. కనుక కర్ణా ఒకటి గుర్తు పెట్టుకో..

ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు, సవాళ్ళు ఉంటాయి. ఏ ఒక్కరి జీవితం పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగా సాగాదు. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు.. మనకు ఎంత అన్యాయం జరిగినా..ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు దక్కాల్సింది దక్కకపోయినా.. ఏ సందర్భంలోనైనా మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. ఇదే మనిషికి చాలా ముఖ్యమైంది. ఎన్ని బాధలు పడ్డా,.. ధర్మాన్ని వదులుకోకూడదని కర్ణునికి.. జీవిత సారం  కృష్ణుడు బోధించాడు.

Also Read:  Rahul Gandhi: కేంద్రం నిర్లక్ష్యం వల్లే.. దేశంలో కరోనాతో 40లక్షల మంది మరణించారు: రాహుల్ గాంధీ